మూడు రెట్లకు పైగా పెరిగిన బంగారం దిగుమతులు

by  |
BANGARAM-1
X

దిశ, వెబ్‌డెస్క్: కరెంట్ అకౌంట్ లోటుపై ప్రభావం చూపే బంగారం దిగుమతులు ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య అధిక డిమాండ్ కారణంగా సుమారు 24 బిలియన్ డాలర్ల(రూ. 1.8 లక్షల కోట్ల)కు పెరిగింది. గతేడాది ఇదే కాలంలో పసిడి దిగుమతి విలువ 6.8 బిలియన్ డాలర్లు(రూ. 51 వేల కోట్లు)గా నమోదైనట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఇక, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో బంగారం దిగుమతులు ఏకంగా 658 శాతం పెరిగి 5.11 బిలియన్ డాలర్ల(రూ. 38.34 వేల కోట్ల)కు పెరిగింది. గతేడాది సెప్టెంబర్‌లో ఇది 601.4 మిలియన్ డాలర్లు(రూ. 4,510 కోట్లు)గా నమోదైన సంగతి తెలిసిందే. ఇక, ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో వెండి దిగుమతులు 15.5 శాతం తగ్గి 619.2 మిలియన్ డాలర్ల(రూ. 4,650 కోట్ల)కు చేరుకున్నాయి. అయితే, సెప్టెంబర్ నెలలో మాత్రమే ఈ దిగుమతులు గతేడాది 9.23 మిలియన్ డాలర్ల(రూ. 7 కోట్ల) నుంచి 552.33 మిలియన్ డాలర్ల(రూ. 4,150 కోట్ల)కు పెరిగాయి. బంగారం దిగుమతులలో గణనీయమైన పెరుగుదల కారణంగా దేశ వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో 22.6 బిలియన్ డాలర్ల(రూ. 1.7 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. పండుగ సీజన్ నేపథ్యంలో డిమాండ్ అధికంగా ఉండటంతో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 19.3 బిలియన్ డాలర్లు(రూ. 1.45 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి.


Next Story

Most Viewed