బాసరలో వైభవంగా కార్తీక హారతి..

by  |

దిశ, బాసర : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రంలో గోదావరి నది ఒడ్డున కార్తీక పౌర్ణమి సందర్భంగా నమో మిషన్ – వందే గో మాతరం మరియు సనాతన వేద భారతి పీఠం ఆధ్వర్యంలో దక్షిణ గంగా గోదావరి కార్తీక హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతీ సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోదావరి హారతి, గుగ్గిల హారతి, ధూప దీప నైవేధ్య హారతి, గో మాత హారతి, చతుర్దశ భువన హారతిని ఇచ్చారు. వేద విద్యా నందగిరి స్వామి చేతుల మీదుగా ఆకాశ దీపం వెలిగించారు. కార్యక్రమానికి భక్తులు భారీగా హాజరయ్యారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story

Most Viewed