'టిమ్స్'కు స్థలం బదిలీ చేస్తూ ఉత్తర్వులు..

by  |
టిమ్స్కు స్థలం బదిలీ చేస్తూ ఉత్తర్వులు..
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా నేపథ్యంలో గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ హాస్టల్‌ను తాత్కాలిక అవసరాల నిమిత్తం ఆస్పత్రిగా మార్చారు. అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దాన్ని 1500 పడకలతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అందుకు తగిన ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. మరో వారం పది రోజుల్లో పేషెంట్లకు వైద్య చికిత్స అందించేందుకు రంగం సిద్ధమైంది. అయితే, ఈ స్థలం రాష్ట్ర యువజన క్రీడా సర్వీసుల మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్నందున వైద్యారోగ్య శాఖకు బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపైన దీన్ని ‘స్పోర్ట్స్ హాస్టల్’ అని కాకుండా ‘టిమ్స్’ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చి)గా పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 9.16 ఎకరాల స్థలాన్ని వైద్యారోగ్య శాఖకు బదిలీ చేస్తూ క్రీడాశాఖ నిర్ణయం తీసుకున్నందున దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ గెజిట్‌లో నోటిఫై చేయాల్సిందిగా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం జీవో జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న దీన్ని అన్ని శాఖలు, విభాగాలు ‘టిమ్స్’గా పరిగణించాలని ఆమె పేర్కొన్నారు.

Tags: Telangana, Corona, Gachibowli, Sports Hostel, TIMES, Gazette


Next Story

Most Viewed