నమ్మించి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా..

by  |
నమ్మించి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా..
X

దిశ, కోదాడ: నువ్వే నా ప్రాణం అన్నాడు.. తల్లిదండ్రులను కాదని అయినా పెళ్లి చేసుకుంటా అన్నాడు. సర్వస్వం నువ్వే అని నమ్మబలికి చివరికి అవసరం తీరాక పెళ్లికి నిరాకరించిన ప్రియుడి ఇంటి ఎదుట ధర్నా చేసిన సంఘటన మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొక్కిరేణి గ్రామానికి చెందిన కమల ప్రసాద్, సైదమ్మ ద్వితీయ పుత్రిక సరోజ అదే గ్రామానికి చెందిన గేల్లా సుధాకర్, శ్రీలత దంపతుల కుమారుడు వెంకటేష్ పాఠశాల నుంచే స్నేహితులు… గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకునే రోజుల్లో వారి స్నేహం ప్రేమగా మారింది. తర్వాత వెంకటేష్ ఇంజనీరింగ్ చదువుకునేందుకు హైదరాబాద్ పట్టణంకు వెళ్లారు. ఇదే క్రమంలో శైలజ కూడా హైదరాబాద్ పట్టణంలో కంప్యూటర్ లో శిక్షణ పొంది ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగంలో చేరింది . ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ బంజారా హిల్స్ లో ఒక గది అద్దెకు తీసుకొని , ఇద్దరు కలిసి సహజీవనం చేశారు.

ఈ క్రమంలో యువతి గర్భవతి అయిన విషయం పెద్దలకు చెప్పి వివాహం చేసుకుందామని యువతి వెంకటేష్ ను ప్రతిపాదించింది. గ్రామంలో తెలిస్తే పరువు పోతుందని ఆమెను బెదిరించి, గుట్టుచప్పుడు కాకుండా గత సంవత్సరం ప్రైవేట్ ఆస్పత్రిలో అబర్షన్ చేయించాడు. యువతికి ఆడ శిశువు జన్మించింది. ఈ విషయం తెలిస్తే ఇంట్లో గొడవ అవుతుందని ఉద్యోగం వచ్చిన వెంటనే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకొని పాపను కూడా తీసుకెళ్తామని అప్పటివరకు శిశువును, తన బావ నరసింహారావు వద్ద ఉంచుదామని వెంకటేష్ నమ్మబలికాడు. చివరికి విషయం తల్లిదండ్రులకు తెలియడంతో గ్రామ పెద్దమనుషుల సమక్షంలో తన సోదరికి నిశ్చితార్థం తర్వాత వివాహం చేసుకుంటానని ఒప్పందం చేసుకున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఎవరికీ తెలియకుండా ఉడాయించాడు.

వెంకటేష్ ను వెతికి తనకు న్యాయం చేయాలని బాధితురాలు మునగాల పోలీసులను 2020 అక్టోబర్2 తేదీన తేదీన పోలీసులను ఆశ్రయించింది. ఈ నెల 7వ తేదీ వెంకటేష్ ఆచూకీ దొరికినట్లు పోలీసులు సమాచారం అందించారు. వెంకటేష్ గృహానికి చేరుకుని యువతి పెళ్లి చేసుకోవాలని కోరినప్పటికీ వెంకటేష్ నిరాకరించాడు. దీంతో యువతి వెంకటేష్ ఇంట్లోనే ఉంటుంది. అదే రోజు వెంకటేష్ తల్లిదండ్రులతో కలిసి నడిగూడెం మండలం శ్రీ రంగాపురం గ్రామంలోని బంధువుల ఇళ్లకు వెళ్లి తలదాచుకున్నారు. మంగళవారం వెంకటేష్ మరో పది మంది బంధువులతో వచ్చి ఇంట్లో నుంచి తనను గెంటి వేశారని బాధితురాలు శైలజ ఆరోపించారు. న్యాయం చేయాలని లేకుంటే ఇలానే ధర్నా చేస్తానని ఇంటి ముందు నిరసన వ్యక్తం చేసింది.



Next Story

Most Viewed