దళిత ప్రేమ వివాహంపై పాలకుర్తి పోలీసుల జులుం.. అత్యుత్సాహం ప్రదర్శించిన ఎస్సై

by Disha Web Desk 23 |
దళిత ప్రేమ వివాహంపై పాలకుర్తి పోలీసుల జులుం.. అత్యుత్సాహం ప్రదర్శించిన ఎస్సై
X

దిశ.జనగామ: జనగామ జిల్లా పాలకుర్తి పోలీసుల దాష్టీకం..ప్రేమ వివాహం చేసుకున్న దళితులపై పోలీసుల ఓవరాక్షన్..కాపాడాలి అని పోతే కొట్టి తిట్టి తాళి మెట్టెలు తీపించి పంపిన వైనం ..ఇదేంటి అంటే బూతు పురాణాలు... ఇది జనగామ జిల్లా పాలకుర్తి పోలీసుల తీరు..

జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలం, గూడూరు గ్రామానికి చెందిన (మాల) గుండుమల అఖిల్ తండ్రి రవి. వయస్సు(22).వ్యవసాయ వరి కోత మిషన్ డ్రైవర్ గా పని చేస్తూ హైదరాబాద్ లో జీవనం కొనసాగిస్తున్నాడు. మహబూబ్ జిల్లాలోని తొర్రూరు మండలం ఫతేపూర్గ్రా మానికి చెందిన గాదె చింతయ్య కూతురు కీర్తి (మాదిగ) వయసు (21) అనే అమ్మాయి గత నాలుగేళ్ల నుంచి అఖిల్ తో పరిచయం ఏర్పడింది.దీంతో ఇద్దరి మధ్య ప్రేమను పెంచుకొని కలసి మెలసి జీవితాంతం జీవించడానికి ఒక్కటై చిలుపూర్ శ్రీ భూగుల వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అర్చకుల వేద మంత్రాలతో కీర్తి మెడలో ఏప్రిల్ 29వ తేదీన అఖిల్ తాళి కట్టి దైవ సమక్షంలో ఇద్దరు దంపతులు ఒక్కటయ్యారు. కీర్తి కుటుంబ సభ్యులు అఖిల్ తల్లిదండ్రులు పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో నివసిస్తున్న వారి ఇంటికి కీర్తి కుటుంబ సభ్యులు వెళ్లి అమ్మాయి కీర్తిని దొంగతనంగా ప్రలోభాలు పెట్టి తీసుకొచ్చారని గొడవ పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న నూతన దంపతులు అఖిల్, కీర్తిలు పాలకుర్తి ఎస్సైల వద్దకు వెళ్లి ఇరువురం ఇష్టపడి ఎవరి ప్రోద్బలం లేకుండా పెళ్లి చేసుకున్నామని తెలియజేశారు. పెళ్లి చేసుకున్న దళిత దంపతులైన మమ్మల్ని ఆశీర్వదించి రక్షించాలని పోలీసులను కాపాడాలని ఆశ్రయించారు.

కానీ ఎస్సైలు బెదిరించి దుర్భాషలాడుతూ, మెడలో కట్టిన తాళిని కాళ్ళకు పెట్టిన మట్టెలను తెంపి ఇద్దరినీ కలవకుండా దూరం చేస్తూ విడదీసి నానా ఇబ్బందులు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే జనగామ జిల్లా అంబేద్కర్ సాక్షిగా వినతిపత్రం ఇస్తూ మీడియా ద్వారా మేము తెలియజేసేది ఒక్కటే తమ సమస్యలను పరిష్కరించి పెళ్ళిచేసుకుని దంపతులైన మమ్మలి (అఖిల్, కీర్తిలను) కలిసి జీవించే విధంగా ఆశీర్వదించాలని, దళితుల పట్ల దుర్భాషలాడుతూ తాళి మెట్టెలు తెంపి పంపించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై సీఎం దృష్టికి దాకా తీసుకెళ్తామని, కమీషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్, కమిషనర్ ఆఫ్ పోలీస్ జనగామ జిల్లా అధికారులను కలసి వినతి పత్రాలను ఆందజేయడం జరిగిందనీ తెలిపారు.మాకు ప్రాణ భయం ఉందని మాకు మా కుటుంబ సభ్యులకు తగిన రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed