మంగళ్‌హాట్‌లో విషాదం.. బాలిక మృతి

41

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్‌లో విషాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఆర్కేపేట్‌లో గోడకూలి ఐదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది.సమాచారం అందుకున్న డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాలిక కుటుంబసభ్యులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

ఇదిలాఉండగా, మొన్న కురిసిన భారీవర్షాల నుంచి హైదరాబాద్ నగరం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. చాలా మంది నిరాశ్రయులయ్యారు. సగానికి పైగా బస్తీవాసులు నీటిలోనే తమ జీవనం సాగిస్తున్నారు. ఎవరైనా ఆదుకునేవారు రాకపోతారా అని వేయి కళ్ళతో ఎదరుచూస్తున్నారు.