హరితహారం అమలుకు వార్డుల వారీగా ప్రణాళిక

by  |
హరితహారం అమలుకు వార్డుల వారీగా ప్రణాళిక
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్ అధికారులను కోరారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జోనల్, డిప్యూటీ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ కుమార్ మాట్లాడుతూ కార్పొరేటర్లతో చర్చించి వార్డు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గ్రేటర్ పరిధిలో మొక్కలు నాటడం, సంరక్షించేందుకు 30వేల మంది ఉద్యోగులను భాగస్వాములను చేయాలని ఆదేశించారు. ప్రతి కాలనీ సంక్షేమ సంఘాన్ని మొక్కలు నాటడంలో భాగస్వాములను చేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన 50లక్షలు మొక్కలు నాటడడంతో పాటు సంరక్షించాలన్నారు. గుంతలు తీయించి, మొక్కలు నాటుటతో పాటు, సంరక్షణకు ప్రతి లొకేషన్‌కు ఒకరిని ఇంచార్జీగా నియమించాలన్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్ కింద జీహెచ్ఎంసీలో అన్నిరోడ్లు కలిపి 9,300 కిలోమీటర్లు ఉంటాయని, రోడ్లకు ఇరువైపులా మొక్కలు కనిపించాలన్నారు. ప్రధానరోడ్లు 709 కి.మీ.లలో రోడ్లకిరువైపుల, మీడియన్స్‌లో ఎవెన్యూ ప్లాంటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మెట్రోరైలు మార్గంలో హెచ్ఎంఆర్ఎల్ శాఖ తరపున హరితహారం చేపడతారన్నారు. శ్మశానవాటికల ప్రహరీ గోడలు గ్రీన్ కర్టెన్స్‌ను తలపించేలా ప్రత్యేక మొక్కలు నాటాలన్నారు. యాదాద్రి మోడల్‌లో హెక్టారు భూమిలో వరుసలలో వివిధ ఎత్తులలో ఉన్న 40వేల మొక్కలను నాటొచ్చునని వివరించారు. లే అవుట్‌లలో బయో ఫెన్సింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సమావేశంలో బయో డైవర్సిటీ అదనపు కమిషనర్ కృష్ణ, సీసీపీ పి.దేవేందర్ రెడ్డి, జోనల్ కమిషనర్లు వి.మమత, ఎన్.రవికిరణ్, బి శ్రీనివాస్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, అశోక్ సామ్రాట్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed