కాంట్రాక్టర్లకు మంత్రి గంగుల కీలక ఆదేశాలు

by  |
కాంట్రాక్టర్లకు మంత్రి గంగుల కీలక ఆదేశాలు
X

దిశ, కరీంనగర్ సిటీ: నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సిటీ డెవలప్‌మెంట్‌లో భాగంగా బుధవారం 18, 19 డివిజన్ల పరిధిలోని రేకుర్తిలో మేయర్ సునీల్ రావుతో కలిసి పర్యటించారు. నగర పాలక సంస్థ నిధుల నుంచి రూ. 1.63 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.1.39 కోట్లతో మంచి నీటి సరఫరా పైపులైన్‌తో పాటు రూ.19 లక్షలతో జంక్షన్ రోడ్డు, రూ. 5 లక్షలతో కాకతీయ కాలువ కల్వర్టు పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు వెంటనే చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. నగరపాలక సంస్థలో విలీన గ్రామాల డివిజన్లలో నివసిస్తున్న ప్రజలకు వసతి సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే మంచినీటి పైప్‌ లైన్ పనులు పూర్తి చేసి.. రేకుర్తి డివిజన్ ప్రజలకు సరఫరా చేస్తామన్నారు. ప్రతి రోజు మంచి నీటిని సరఫరా చేయడంతో పాటు రానున్న రోజుల్లో నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో 24 గంటల మంచి నీరు సరఫరా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి హరిశంకర్, కమిషనర్ యాదగిరి రావు, పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, డివిజన్ల ప్రజలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed