ఆ సిక్సే మీకు ముఖ్యమైపోయిందా : గంభీర్

by  |
ఆ సిక్సే మీకు ముఖ్యమైపోయిందా : గంభీర్
X

భారత జట్టు రెండోసారి క్రికెట్ ప్రపంచ కప్ గెలిచి నిన్నటికి తొమ్మిదేండ్లు గడిచాయి. ఈ సందర్భంగా ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో తమ ట్విట్టర్ అకౌంట్లో ఆ విజయాన్ని గుర్తు చేస్తూ ఒక ట్వీట్ చేసింది. ధోనీ ఇన్నింగ్స్ చివర్లో కొట్టిన సిక్స్ ఫొటోను జత చేస్తూ.. ‘2011లో ఇదే రోజు.. ఆ షాట్ కొన్ని లక్షల మందిని ఆనందోత్సాహాల్లో ముంచెత్తింది’ అని పోస్ట్ చేసింది. కాగా ఆ రోజు ఫైనల్లో 97 పరుగులు చేసిన గౌతమ్ గంభీర్ దీనిపై స్పందిస్తూ.. ‘ఈఎస్‌పీఎన్ మీకో విషయం గుర్తు చేద్దామనుకుంటున్నా.. 2011లో యావత్ భారతదేశం గెలిచింది. టీం ఇండియాతో పాటు సహాయక సిబ్బంది కూడా గెలిచారు. మీరు మాత్రం ఆ సిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు’ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. కాగా.. గంభీర్ టీం ఇండియా నుంచి త్వరగా తప్పుకోవడానికి ధోనీ కారణమనే వార్తలు వచ్చాయి. ధోనీ కెప్టెన్‌గా ఉన్న కాలంలో చాలా మంది సీనియర్లను తప్పించి.. యువతకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ క్రమంలో గంభీర్ కూడా చోటు కోల్పోయాడు. దాంతో చాలా కాలంగా ధోనీ, గంభీర్ మధ్య వివాదం నడుస్తోంది. అందుకే ఈఎస్‌పీఎన్ ట్వీట్‌కు గంభీర్ అలా రీట్వీట్ చేశాడని పలువురు చర్చించుకుంటున్నారు.

Tags: 2011 world cup, Gambhir, MS Dhoni, Cric info


Next Story

Most Viewed