పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎందుకు మద్దతు ఇచ్చింది : గాదగోని రవి

by  |
పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎందుకు మద్దతు ఇచ్చింది : గాదగోని రవి
X

దిశ, గూడూరు : కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు పైకి విమర్శలు చేసుకుంటున్నా, ఆచరణలో మాత్రం దొందు దొందే అని యంసిపిఐయు రాష్ట్ర సహాయ కార్యదర్శి గాదగోని రవి విమర్శించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం లో బీజేపీ తెచ్చిన రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలకు పార్లమెంట్ లో టీఆర్ఎస్ పార్టీ ఎందుకు మద్దతు ఇచ్చిందని ప్రశ్నించారు. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పోడు రైతుల సమస్య, డబుల్ బెడ్ రూం సమస్య, నిరుద్యోగ సమస్య, వరి రైతుల సమస్య ఇలా ప్రతి సమస్య విషయంలో బీజేపీ అడుగు జాడల్లో నడిచిందని ఎద్దేవా చేశారు. అందుకే హుజురాబాద్ ఎన్నికల్లో ఓడిపోగానే కేసీఆర్ కి తెలంగాణ సమాజం పై ప్రేమ పుట్టుకు వచ్చిందన్నారు.

పోడు రైతుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోందని, పేద ప్రజలందరికీ అటవీ హక్కుల చట్టాన్ని వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 1,2,3 తేదీల్లో పార్టీ కేసముద్రం లో రాష్ట్ర స్థాయి సామాజిక, వైజ్ఞానిక శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న, జిల్లా నాయకులు పానుగంటి నర్సయ్య, నూకల ఉపేందర్, బందెల వీరాస్వామి, కటకం బుచ్చిరామయ్య పాల్గొన్నారు.


Next Story

Most Viewed