ట్రెండింగ్‌లో ‘రాధే శ్యామ్‌’ సెకండ్‌ సింగిల్‌ ‘ఆషీకి ఆగయీ’

by  |
radhe shyam
X

దిశ, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ అప్‌కమింగ్ మూవీ ‘రాధే శ్యామ్‌’ నుంచి తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌ అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే సెకండ్‌ సింగిల్‌ ‘ఆషీకి ఆగయీ’ హిందీ వెర్షన్‌‌ను విడుదల చేశారు మేకర్స్. ప్రభాస్, పూజ రొమాంటిక్ లుక్‌లో కనిపించిన ఈ పాటలో ‘నిన్ను నువ్వు రోమియో అనుకుంటున్నావా? అని పూజ అడిగితే.. ‘అతడు ప్రేమ కోసం ప్రాణాలిచ్చాడు, నేను ఆ టైపు కాదు’ అని ప్రభాస్‌ బదులివ్వడం మ్యాజికల్‌గా ఉంది. ఇక సాంగ్ లొకేషన్స్‌ అన్నీ విజువల్‌ వండర్‌గా కనిపిస్తుండటం విశేషం. కాగా ‘ఆషికీ ఆగయీ’ తెలుగు వర్షెన్‌ సిద్‌ శ్రీరామ్‌ ఆలపించిన ‘నగుమోము తారలేగా’ సాంగ్‌ను ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ వెల్లడించింది.


Next Story

Most Viewed