వాటిని నాశనం చేస్తున్న అమెజాన్?

by  |
వాటిని నాశనం చేస్తున్న అమెజాన్?
X

దిశ, వెబ్‌డెస్క్: ఫ్రాన్స్‌లోని పారిస్‌లో శుక్రవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ భవనం ముందు చెక్కముక్కలతో చేసిన పెద్ద పెద్ద డెలివరీ బాక్స్‌లను పట్టుకుని క్లైమేట్ యాక్టివిస్ట్‌లు ధర్నా చేశారు. అందుకు కారణం ఏంటంటే.. అక్కడి ఆన్‌లైన్ బిజినెస్‌లో అమెజాన్ విస్తరిస్తుండటం. ‘ఏఎన్‌వీ కాప్ 21, అట్టాక్, అమిస్ దె ల టెర్రె’ అనే మూడు గ్రూపులు ఈ ధర్నాకు నాయకత్వం వహించాయి. అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్, ఫ్రెంచ్ ఫ్రెసిడెంట్ ఎమ్మాన్యుయేల్ మాకరోన్ తమ పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశాయి. అమెజాన్ కారణంగా ఫ్రాన్స్‌లో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని, ఉన్న ఉద్యోగాలను అమెజాన్ నాశనం చేస్తోందని, అంతేకాకుండా ఎక్కడపడితే అక్కడ వేర్‌హౌస్‌లు ఏర్పాటు చేసి పర్యావరణానికి కూడా నష్టం కలిగిస్తోందని ఈ గ్రూపులు చెప్పాయి.

మరి నిజంగానే ఫ్రాన్స్‌లో అమెజాన్ విస్తరించడం వల్ల నష్టాలు ఉన్నాయా? ఈ గ్రూపులు చెబుతున్న దాని ప్రకారం చాలా మంది ఫ్రెంచ్ పీపుల్ గ్రామీణ వాతావరణాన్ని ఇష్టపడుతుంటారు. అయితే అమెజాన్ వల్ల గ్రామీణ వాతావరణం కాస్త పట్టణ వాతావరణంగా మారిపోతోందని, తమ వద్ద ఉన్న పర్యావరణ జీవవైవిధ్యత దెబ్బతింటోందని వారు చెబుతున్నారు. పక్కనే ఉండే దుకాణాలకు వెళ్లి కావాల్సినవి కొనుక్కునే తమ సంస్కృతిని, అమెరికాకు చెందిన అమెజాన్ కంపెనీ వచ్చి వినియోగదారు వ్యవస్థ ఆధారిత సంస్కృతిగా మార్చే అవకాశం ఉందని వారు వాపోతున్నారు. ప్రస్తుతం సెకండ్ లాక్‌డౌన్‌లో ఫ్రాన్స్‌లో అమెజాన్ ఆన్‌లైన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌కు కూడా ఫ్రెంచ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కొత్త వేర్‌హౌస్‌లు ఏర్పాటు చేయకుండా, అమెజాన్ అమ్మకాలు నగరవాస్తవ్యులకే పరిమితం కావాలని క్లైమేట్ యాక్టివిస్ట్‌లు కోరుతున్నారు.


Next Story

Most Viewed