కేసీఆర్ గుడ్‌న్యూస్.. వారికి కరెంట్ ఫ్రీ

192

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని సెలూన్లు, లాండ్రీ షాపులు, ధోబీ ఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలు, నాయీ బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వానికి ఇప్పటికే పలుమార్లు విన్నవించగా.. సీఎం కేసీఆర్ తక్షణమే జీవో జారీ చేయాల్సిందిగా సీఎంవో కార్యదర్శి భూపాల్ రెడ్డిని ఆదేశించారు.

సీఎం ఆదేశాల మేరకు ఈ జీవోను బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం విడుదల చేశారు. ఉచిత విద్యుత్ సరఫరా ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో గ్రామస్థాయి నుంచి జీహెచ్ఎంసీ వరకు ఉన్న కులవృత్తిదారులకు శారీరక శ్రమ తగ్గడమే కాక ఆర్థిక వెసులుబాటు కూడా కలగనుంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..