నేటి నుంచి ఉచిత తాగునీరు పంపిణీ

37

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరబాద్‌లో నేటి నుంచి ఉచిత తాగునీటి సరాఫరా జరగనుంది. ఇవాళ రెహమత్‌నగర్‌లోని ఎస్పీఆర్ హిల్స్‌లో ఉచిత తాగునీరు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఒక్కో కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా సరాఫరా జరగనుంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ మేరకు ఈ పథకం ప్రారంభం కానుంది. బస్తీల్లో నల్లాలకు మీటర్లు లేకున్నా ఉచిత తాగునీటి సరాఫరా పథకం అందనుంది. అపార్టుమెంట్లలో నీటిమీటర్లు తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది.