దేశీయ మార్కెట్లలో కొనసాగుతున్న విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ!

by  |
FPI
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ. 949 కోట్లను వెనక్కి తీసుకున్నారు. తాజా డిపాజిటరీల గణాంకాల ప్రకారం.. ఈ నెలలో ఇప్పటివరకు ఈక్విటీల నుంచి రూ. 4,694 కోట్లను ఉపసంహరించుకోగా, రుణ విభాగంలో రూ. 3,745 కోట్ల పెట్టుబడులను పెట్టారు. దీంతో నికరంగా రూ. 949 కోట్ల ఎఫ్‌పీఐ నిధులు మార్కెట్ల నుంచి వెనక్కి వెళ్లాయని గణాంకాలు వెల్లడించాయి. అక్టోబర్‌లో ఎఫ్‌పీఐలు రూ. 12,437 కోట్ల నిధుల ఉపసంహరణ నమోదైన సంగతి తెలిసిందే. భారతీయ ఈక్విటీల అధిక వాల్యూయేషన్ కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారని మార్నింగ్‌స్టార్ ఇండియా మేనేజర్ రీసెర్చ్ అసోసియేషన్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ చెప్పారు. అంతేకాకుండా ప్రపంచ ద్రవ్యోల్బణ ఇత్తిడి, అభివృద్ధి చెందిన కొన్ని ఆర్థికవ్యవస్థల్లో మందగమనం ఆందోళన కలిగించే విషయమని హిమాన్షు అన్నారు.



Next Story

Most Viewed