దక్షిణ మధ్య రైల్వేకు నాలుగు జాతీయ అవార్డులు

by  |
దక్షిణ మధ్య రైల్వేకు నాలుగు జాతీయ అవార్డులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రం అందించే జాతీయ ఇంధన పొదుపు అవార్డులలో దక్షిణ మధ్య రైల్వే నాలుగు అవార్డులు సాధించింది. 31వ జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 14 నుంచి 21 వరకు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సమయంలో ఈ అవార్డులను అందించనున్నారు. సహజ ఇంధన పరిరక్షణ, అందుబాటులో ఉన్న ఇంధన వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో ఆదర్శనీయమైన పనితీరును ప్రదర్శించే వివిధ పరిశ్రమల సంస్థలను గుర్తించి ప్రతి సంవత్సరం జాతీయ ఇంధన పొదుపు అవార్డులను ప్రకటిస్తారు.

ఈ సందర్భంగా భవనాల కేటగిరిలో విజయవాడ ఆసుపత్రుల విభాగానికి మొదటి బహుమతి, పీహెచ్‌డీ విభాగం క్రింద కాచిగూడ స్టేషన్‌ చారిత్రక కట్టడానికి మొదటి బహుమతి, పీహెచ్‌డీ విభాగం క్రింద విజయవాడ ఎలక్ట్రిక్‌ ట్రాక్షన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌‌కు రెండవ బహుమతి, పీహెచ్‌డీ విభాగం క్రింద సంచాలన్‌ భవన్‌ (సికింద్రాబాద్‌ డివిజన్‌ ప్రధాన కార్యాలయ భవనం)కు మెరిట్‌ సర్టిఫికేట్ లభించింది. దక్షిణ మధ్య రైల్వే గత 10 సంవత్సరాలుగా కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ నుండి జాతీయ పొదుపు అవార్డులను గెలుచుకుంటుంది. ఈ సందర్భంగా అవార్డులు కైవసం చేసుకోవడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య అభినందించారు.



Next Story

Most Viewed