గూడు దగ్ధం.. గోడు మిగిలే

by  |
గూడు దగ్ధం.. గోడు మిగిలే
X

దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం గాంధీనగర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నాలుగు నివాస గుడిసెలు దగ్ధం కావడమే కాకుండా.. లోపల ఉన్న బంగారం, వెండి, నగదుతో పాటు ఫర్నీచర్ పూర్తిగా కాలిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని వారు గోడు వెళ్లబోసుకున్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎవరైనా నిప్పు అంటించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


Next Story

Most Viewed