బ్రేకింగ్ : AIIMS‌లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

81

దిశ, వెబ్‌డెస్క్ : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే ఢిల్లీలోని AIIMS ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మన్మోహన్‌ను పరిక్షించిన వైద్యులు జ్వరం, వీక్‌నెస్‌తో బాధపడుతున్నట్టు పేర్కొన్నారు. ఇదిలాఉండగా, 89 ఏళ్ల మాజీ ప్రధాని ఈ యేడాది మొదట్లో కరోనా బారిన పడటంతో ఆయన ఏయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం కొవిడ్ నుంచి కోలుకున్నాక తిరిగి ఆయన ఇంటికి చేరుకున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..