సీఎం కేసీఆర్‌కు మాజీ మంత్రి బాబు మోహన్ సూటి ప్రశ్న.. ఇంకెప్పుడు?

by  |
సీఎం కేసీఆర్‌కు మాజీ మంత్రి బాబు మోహన్ సూటి ప్రశ్న.. ఇంకెప్పుడు?
X

దిశ, ఆందోల్ : రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందని, సీఎం కేసీఆర్ లక్ష ఉద్యోగాల హామీ ఏమైందని మాజీ మంత్రి బాబుమోహన్ ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం ఆందోల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవిస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని స్పష్టమైన హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఉద్యోగ నోటిఫికేషన్ ఎందుకు వేయలేదో చెప్పాలన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఈ ప్రభుత్వానికి నోటిఫికేషన్లు గుర్తుకు వస్తాయని విమర్శించారు.

నిరుద్యోగ సమస్యపై ఈ నెల 16న హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్నామని, యువకులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మిలియన్ మార్చ్‌ను సక్సెస్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ పటిష్టం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు హరినారాయణ వర్మ, అందోల్, జోగిపేట, చౌటకూర్, అల్లాదుర్గం, మునిపల్లి, రాయికోడ్, వట్‌పల్లి, టేక్మాల్ మండలాల అధ్యక్షులు నవీన్ కుమార్, సాయి, శేఖర్ గౌడ్, ఆనంద్ శర్మ, సుమన్, సతీశ్, మధుసూదన్ రెడ్డి, నవీన్ గుప్తా, జిల్లా నాయకులు శ్రీనివాస్, జగన్నాథం, నాయకులు మహేష్కర్ సుమన్, చంద్రశేఖర్, శివశంకర్, ఈశ్వర్, ఉదయ్ రాజ్, గోవర్ధన్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed