దివాళా అంచున ఫుట్‌బాల్ క్లబ్స్..?

by  |
దివాళా అంచున ఫుట్‌బాల్ క్లబ్స్..?
X

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలే కుదేలవుతుండగా.. స్టాక్ మార్కెట్లు పతనంతో వేల కోట్ల రూపాయలు ఆవిరైపోతున్నాయి. ఇప్పుడు ఈ ఆర్థిక నష్టాలు క్రీడలను కూడా చుట్టుముట్టాయి. కరోనా వైరస్ ప్రభావంతో ఫ్రాన్స్‌లోని ఫుట్‌బాల్ క్లబ్స్ దివాళా అంచుకు చేరుకున్నాయట. ఈ విషయాన్ని స్వయంగా ఫ్రాన్స్ ఫుట్‌బాల్ క్లబ్స్ సంఘం అధ్యక్షుడు బెర్నార్డ్ సియాజో వెల్లడించారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరగాల్సిన ఫుట్‌బాల్ సీజన్ మొత్తం వాయిదా పడింది. జూన్ 15 వరకు తిరిగి ఆట ఆడే అవకాశమే లేకుండా పోయింది. కరోనా కారణంగా ఈ ఏడాది జనవరి నుంచి మ్యాచులు నిలిపిపివేశారు. అంటే దాదాపు ఆరు నెలల పాటు క్లబ్స్ ఏవీ లీగ్స్‌లో పాల్గొనడం లేదు. జులై- ఆగస్టు వరకు ఇదే పరిస్థితి కొనసాగితే క్లబ్స్ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత త్వరగానే లీగ్స్ ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు బెర్నార్డ్ తెలిపారు.

tags: Football Leagues, Corona effect, stock Markets, Bernard Size


Next Story

Most Viewed