మహీంద్రా లాజిస్టిక్‌తో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం

by  |
మహీంద్రా లాజిస్టిక్‌తో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన డెలివరీ సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. డెలివరీ సేవల కోసం ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేందుకు మహీంద్రా లాజిస్టిక్స్‌తో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపింది. ఇరు సంస్థల మధ్య ఒప్పందంలో భాగంగా 2030 నాటికి మొత్తం 25 వేలకుపైగా ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేర్కొంది. మహీంద్రా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన మహీంద్రా లాజిస్టిక్ ఇప్పటికే పలు ఈ-కామర్స్ సంస్థలతో కలిసి ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీ సేవలను ప్రారంభించింది.

దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో డెలివరీ సేవలను విజయవంతంగా కొనసాగిస్తోంది. తాజాగా ఫ్లిప్‌కార్ట్‌తో ఇప్పందం ద్వారా టూ-వీలర్, త్రీ-వీలర్ వాహనాలను ఉత్పత్తుల డెలివరీల సేవలను అందించనుంది. ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం ద్వారా మహీంద్రా లాజిస్టిక్ కార్యకలాపలు దేశవ్యాప్తంగా మరింత విస్తరించనున్నట్టు కంపెనీ మంగళవారం ప్రకటనలో వెల్లడించింది

Next Story

Most Viewed