హైదరాబాద్ జట్టుకు వార్నింగ్ ఇచ్చిన పంజాబ్ కొత్త కెప్టెన్

by Harish |
హైదరాబాద్ జట్టుకు వార్నింగ్ ఇచ్చిన పంజాబ్ కొత్త కెప్టెన్
X

దిశ, స్పోర్ట్స్ : పంజాబ్ కింగ్స్ తమ చివరి మ్యాచ్‌లో వికెట్ కీపర్ జితేశ్ శర్మ సారథ్యంలో బరిలోకి దిగనుంది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌ పంజాబ్‌కు ఆఖరిది. ఈ మ్యాచ్‌కు జితేశ్‌ను కెప్టెన్‌గా నియమించినట్టు పంజాబ్ ఫ్రాంచైజీ శనివారం వెల్లడించింది.

ఈ సీజన్‌లో పంజాబ్‌‌‌కు నాయకత్వం వహిస్తున్న మూడో సారథి జితేశ్ శర్మ. శాశ్వత కెప్టెన్ శిఖర్ ధావన్ ఐదు మ్యాచ్‌లకు మాత్రమే కెప్టెన్‌గా వ్యవహరించాడు. గత నెల 9న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడి మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో సామ్ కర్రన్ జట్టును నడిపించగా.. ఈ నెల 15న రాజస్థాన్‌తో మ్యాచ్ అనంతరం జాతీయ జట్టు బాధ్యతల నేపథ్యంలో అతను ఇంగ్లాండ్‌కు వెళ్లిపోయాడు. దీంతో హైదరాబాద్‌తో మ్యాచ్‌లో జితేశ్‌కు పగ్గాలు దక్కాయి.

ఈ సీజన్‌లో పంజాబ్ ఇప్పటికే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌పై నెగ్గి విజయంతో సీజన్‌ను ముగించాలని ఆ జట్టు భావిస్తున్నది. ఈ మ్యాచ్‌‌కు ముందు హైదరాబాద్ జట్టును జితేశ్ హెచ్చరించాడు. శనివారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అతను మాట్లాడుతూ.. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో నిర్భయంగా ఆడతామని తెలిపాడు. ఇంకా తాము కోల్పోయేది ఏం లేదని, విజయమే లక్ష్యంగా ఆడతామని చెప్పాడు.



Next Story

Most Viewed