కర్ణాటకలో తొలి ఉచిత ప్లాస్మా బ్యాంక్

by  |
కర్ణాటకలో తొలి ఉచిత ప్లాస్మా బ్యాంక్
X

బెంగళూరు: కర్ణాటకలో దేశంలోనే తొలి ఉచిత ప్లాస్మా బ్యాంకు ఏర్పాటు చేస్తున్నారు. బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్‌లో ఈ బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర అధికారులు వెల్లడించారు. సాయి కృష్ణ చారిటబుల్ ట్రస్టు‌తో కలిసి ఈ బ్యాంకును నిర్వహించబోతున్నట్టు తెలిపారు. తొలుత ఇది డోనర్లకు మాత్రమే తెరిచి ఉంటుందని, సరిపడా దాతలు లభించినతర్వాత కరోనా పేషెంట్ల కోసం ఉచితంగా ఈ ప్లాస్మా బ్యాంకు సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. కరోనా నుంచి కోలుకున్నవారి నుంచి యాంటీబాడీలు సేకరించి కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ విధానంలో అందించి చికిత్స చేస్తారు. ఇటీవలే ప్లాస్మా డొనేట్ చేయాలని కర్ణాటక సర్కారు కరోనా నుంచి కోలుకున్నవారిని అభ్యర్థించిన సంగతి తెలిసిందే. వారికి ప్రోత్సాహకంగా రూ. 5,000లను అందజేయనున్నట్టు ఇటీవలే ప్రకటించింది.



Next Story

Most Viewed