బ్రేకింగ్: నాంపల్లి SBI బ్యాంక్‌లో అగ్నిప్రమాదం

by Vadlamudi Anukaran |

<p>దిశ, హైదరాబాద్: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అజంతా గేటుకు అనుకోని ఉన్న ఎస్బీఐ నాంపల్లి శాఖ కార్యాలయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్కూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. బ్యాంకు మూసి ఉండడంతో కిటికీలో నుంచి పొగలు బయటికి రావడంతో అక్కడే విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమతమై బేగంబజార్ పోలీసులు, అగ్నిమాపాక శాఖకు సమాచారం అందించారు. 5 నిముషాల వ్యవధిలో ఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకొని బ్యాంకు కిటికీలను, షట్టర్ లను విరగొట్టి ఎగసి [&hellip;]</p>

బ్రేకింగ్: నాంపల్లి SBI బ్యాంక్‌లో అగ్నిప్రమాదం
X

దిశ, హైదరాబాద్: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అజంతా గేటుకు అనుకోని ఉన్న ఎస్బీఐ నాంపల్లి శాఖ కార్యాలయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్కూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. బ్యాంకు మూసి ఉండడంతో కిటికీలో నుంచి పొగలు బయటికి రావడంతో అక్కడే విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమతమై బేగంబజార్ పోలీసులు, అగ్నిమాపాక శాఖకు సమాచారం అందించారు.

5 నిముషాల వ్యవధిలో ఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకొని బ్యాంకు కిటికీలను, షట్టర్ లను విరగొట్టి ఎగసి పడుతున్న మంటలను అదుపు చేసారు. ఈ ప్రమాదంలో బ్యాంకులోని ఫర్నీచర్ అగ్నికి అహుతి అయ్యింది. కొన్ని కంప్యూటర్లు సైతం కాలి బూడిద అయ్యాయి. ఈ ప్రమాదంలో బ్యాంకు స్ట్రాంగ్ రూమ్‌కు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని ఎస్బీఐ బ్యాంకు సిబ్బంది, పోలీసులు తెలిపారు.

Next Story