మౌలాలి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

by  |
మౌలాలి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం
X

దిశ, హైదరాబాద్: మౌలాలి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లాట్ ఫాంపై ఆగి ఉన్న రైలులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన రైల్వే అధికారులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. రెండు ఫైరింజన్ల సహాయంతో ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

tag;fire accident, moulali railway station, train burn


Next Story

Most Viewed