అగ్నిప్రమాదం.. నవజాత శిశువులు మృతి

53

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భందరా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఐసీయూ విభాగంలో శుక్రవారం అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో ఐసీయూలో 17 మంది నవజాతి శిశువులు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.