రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం!

by  |
రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది ఇప్పటివరకు విదేశీ సంస్థాగత పెట్టుబడులు(ఎఫ్ఐఐ)రికార్డు స్థాయిలో రూ. 79,854 కోట్లకు చేరుకున్నాయి. ఈ ఏడాది ముగియడానికి ఇంకా ఎనిమిది ట్రేడింగ్ సెషన్లు మిగిలి ఉండటంతో ఈ వ్యవధిలో ఎఫ్ఐఐ పెట్టుబడులు రూ. లక్ష కోట్లను దాటే అవకాశం ఉంది. ఇది గతేడాది నమోదు చేసిన రూ. 1.06 కోట్లకు సమానస్థాయిలో ఉండొచ్చనే అంచనాలున్నాయి. ఒకవేళ ఈ మొత్తాన్ని దాటితే 2013లో ఆల్‌టైమ్ హైగా నమోదైన రూ. 1.13 లక్షల కోట్ల తర్వాత రెండో అత్యధిక ఎఫ్ఐఐ పెట్టుబడులుగా నిలవనుంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు, డాలరు బలహీనత నేపథ్యంలో భారత్‌లోకి పెట్టుబడులు పెరిగాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు బలమైన కార్పొరేట్ ఆదాయాల సెంటిమెంట్‌ను పెంచాయని భావిస్తున్నారు. అంతేకాకుండా సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీల ఫలితాలు విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించాయి. ‘గడిచిన వారంలో స్పష్టంగా రియల్ ఎస్టేట్ స్టాక్‌లకు సానుకూలంగా ఉన్నప్పటికీ, ఈ వారంలో ఫార్మా, ఐటీ రంగాలు తమ ర్యాలీని మెరుగ్గా కొనసాగిస్తాయనే నమ్మకం ఉంది’ అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఎస్ రంగనాథన్ చెప్పారు.


Next Story