రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే సీఎం ధ్యేయం

by  |
రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే సీఎం ధ్యేయం
X

దిశ, మెదక్: రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని కలెక్టర్ పి. వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. గురువారం కాలువల నిర్మాణాలపై గజ్వేల్ సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆర్డీఓ అనంతరెడ్డి, డీపీవో సురేష్ బాబు, ఇరిగేషన్ ఎస్సీ వేణు సంబంధిత అధికారులు దౌల్తాబాద్, రాయపోల్ , గజ్వేల్, వర్గల్ మండలాల తహసీల్దార్లు, సర్పంచులు, వీఆర్వోలతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమన్నారు. అందరి సహకారంతో రిజర్వాయర్లు, ప్రధాన కాల్వలు నిర్మించుకున్నాం. ప్రస్తుతం డిస్ట్రిబ్యూట్ కాలువల నిర్మాణమే మనముందున్న ఏకైక కర్తవ్యం అని తెలిపారు. దీనికి రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో 10 నుంచి 12 ఎకరాల్లో డిస్ట్రిబ్యూటర్ కాలువలు నిర్మాణం జరుగబోతుందన్నారు. కేవలం మన జిల్లాలో 900 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్ కాలువల నిర్మాణం చేపట్టాలన్నారు. అందుకు 4690 ఎకరాల భూ సేకరణ చేయాలన్నారు. ఈ నిర్మాణాలు మూడు నెలల్లో పూర్తి కావాల్సిన ఉందని కాబట్టి, ప్రతి రైతు అందుకు సహకరించాలని చెప్పారు.

Tags: farmers happiness, cm kcr aim, collector venkatram reddy



Next Story

Most Viewed