ఎండుతున్న పంటలు… మండుతున్న ఎండలు

by  |
ఎండుతున్న పంటలు… మండుతున్న ఎండలు
X

దిశ, వేములవాడ: పంట చేతికందే సమయంలో పంట పొలాలు ఎండిపోవడంతో రైతుల గుండెలు పగులుతున్నాయి. చెరువులను నమ్ముకోని వరి పంటలు సాగు చేస్తున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. చెరువులో నీళ్లు ఉన్నప్పటికి, కాల్వల ద్వారా నీటిని సరఫరా చేయకుండా పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో వరి పంటలు సాగు చేసిన రైతులకు పంట చేతికందే సమయానికి నీళ్లు అందక పంటలన్నీ ఎండిపోతున్నాయి. దీంతో ఏమి చేయాలో తెలియక రైతులు వరి పంటలను పశువుల మేతకు ఉపయోగిస్తున్నారు. పంట సాగుకు చేసిన పెట్టు బడులు మీద పడుతున్నాయనీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో ఊర చెరువు కింద 200 వందల ఎకరాల భూమి ఉండగా, రైతులు వరి పంటలు సాగు చేశారు. పంట పొలాలకు నీరందించే కాల్వలు పూర్తిగా కబ్జాకు గురియ్యాయి. దీంతో పొలాలలకు నీరందక ఎండిపోతున్నాయి. గత ఇరువై ఏళ్లుగా పంట పొలాలకు నీరందక ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ప్రతి యేటా పాలకులకు, ఆఫీసర్లకు విన్నవించుకున్న పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. వేములవాడ మండలం లింగంపల్లి మూలవాగు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఊర చెరువులోకి నీళ్లు తీసుకవచ్చేందుకు రూ.44 లక్షలతో పనులు పూర్తి చేశారు. కానీ చెరువులోకి నీళ్లు తీసుకరాకుండా తన జేబుల్లోకి పైసలు మాత్రం వేసుకున్నాడు. ఇప్పటికైనా కబ్జాకు గురైనా కాల్వలు వినియోగంలోకి తీసుకవచ్చి, పొలాలకు సాగు నీరందేలా చూడాలనీ ఆయకట్టు రైతులు కోరుతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed