పెట్రోల్ తాగి, ఒంటిపై పోసుకుని రైతు ఆత్మహత్యాయత్నం.. ఎక్కడంటే!

by  |
mro-office
X

దిశ, మహబూబాబాద్ : తమకు న్యాయం చేయాలని కోరుతూ ఓ రైతు కుటుంబం ఎమ్మార్వో ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగింది. అధికారులు పట్టించుకోకపోవడంతో రైతు తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో గురువారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఓ రైతు దంపతులు తమ భూమి కబ్జాకు గురైందని ఆరోపిస్తూ తహశీల్దార్ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. MRO నాగభవానితో వీరికి వాగ్వివాదం నెలకొనగా మనస్తాపం చెందిన ఇస్లావత్ వసంత్ రావు ఆత్మహత్యాయత్నానికి పూనుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. బయ్యారం మండలం రామచంద్ర పురానికి చెందిన ఇస్లావత్ వసంత్ రావు, దేవి దంపతులకు సర్వే నెంబర్ 60/30లో ఆరు ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. ఇట్టి భూమి తన తండ్రి లింబియా పేరు మీద రికార్డులో ఉందన్నారు. జీవనోపాధి కోసం గత కొన్నేళ్లుగా ఇతర రాష్ట్రాల్లో కూలీ పనులు చేసుకుంటున్నట్లు వివరించారు. ఇటీవల గ్రామానికి రాగా తమ భూమిని ఇతరులు కబ్జా చేసినట్లు ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోవడం లేదని వాపోయారు. దీంతో మనస్తాపం చెందిన వసంతరావు పెట్రోల్ తాగి, ఒంటి పై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని అడ్డుకుని చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట టెన్షన్ వాతావరణం నెలకొంది.

Next Story

Most Viewed