రంగంలోకి భార్య, పిల్లలు..!

by  |
రంగంలోకి భార్య, పిల్లలు..!
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ప్రచారంలో స్థానిక కార్యకర్తలు ఉంటే ఆ అభ్యర్థులకు ఎంతో బలం. సాధారణంగా ఎన్నికల పరిశీలకులుగా ఇతర ప్రాంతాల ప్రతినిధులు ఇన్ చార్జిలుగా వ్యవహరిస్తారు. కానీ ఇప్పుడు ఎన్నికల ఇన్ చార్జిలతో పాటు అనుచరులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొంటున్నారు. డివిజన్లోని కాలనీలకు సంబంధం లేని వ్యక్తులు ప్రచారం చేస్తున్నారు. లోకల్ ప్రజలపై అవగాహన కలిగిన నాయకులు లేరు. మా పార్టీ గుర్తుకు ఓటు వేయండి అని ఏ పార్టీ అభ్యర్థి ఆపార్టీకి చేసుకుంటున్నారు. కాలనీ సమస్యలు తెలి యవు వ్యక్తులను గుర్తుపట్టే పరిస్థితి లేదు. అభ్యర్థులకు కార్యకర్తలు మద్దతు లేకపోవడంతో బంధువులు, మిత్రులపై ఆధారపడుతున్నారు.

రామంటున్న కార్యకర్తలు…

ప్రచారం చేసేందుకు అభ్యర్థులు కార్యకర్తల వెంటపడుతున్న మేము రాం అంటున్న పరిస్థితి డివిజన్లో కనిపిస్తుంది. గెలిచే వరకే కార్యకర్త అవసరం..ఆ తరువాత అవసరాలను బట్టి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి నాయకులను నమ్ముకొని జీవితాలు రోడ్లపై ఎందుకు వేసుకోవాలనే సందేహాలను కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తంతు ప్రధానంగా అధికార టీఆర్ఎస్ లోనే కార్యకర్తలు దూరమైనట్లు కనిపిస్తుంది. వెంట తిరిగే కార్యకర్తలు లేకపోవడంతో కొంత ఇబ్బంది పడుతున్నారు.

బంధువులు, మిత్రులే దిక్కు…

అభ్యర్థులకు స్థానిక కార్యకర్తల అండదండలు లేకపోవడంతో బంధువులను, మిత్రులను ప్రచారాలకు, వెంట తిరిగేందుకు పిలుపించుకుంటున్నారు. భార్య, పిల్లలకు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఎల్బీనగర్, ఉప్పల్, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లోని డివిజన్ లోని టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు అదే పనిలో నిమగ్న మైనారు. ఒక్కో డివిజన్ లో అభ్యర్థి కోసం ప్రచారం చేసేందుకు 200 నుంచి 300 వరకు మంది దిగుమతి చేసుకున్నారు. వీరందరికి షెల్టర్ తోపాటు భోజనం వసతిని కల్పిస్తున్నారు. అంతేకాకుండా ప్రచారం ముగిసే వరకు ఉండేవాళ్లకు ప్యాకేజీలు ఇస్తున్నట్లు సమాచారం.



Next Story