విత్తనాలు కొనుగోలు క్రమంలో దొంగ నోటు కలకలం.. రైతులకు ఇక ఇబ్బందేనా ?

by  |
విత్తనాలు కొనుగోలు క్రమంలో దొంగ నోటు కలకలం.. రైతులకు ఇక ఇబ్బందేనా ?
X

దిశ, నెక్కొండ: వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో దొంగనోటు వ్యవహారం కలకలం రేపుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ముద్రించిన విధంగా 200 రూపాయల దొంగ నోటు బుధవారం నెక్కొండ మండల కేంద్రంలోని ఓ ప్రయివేట్ ఫర్టిలైజర్ దుకాణంలో బయటపడింది. రైతులు రబీ పంట సాగుకు సంబంధించి విత్తనాలు కొనుగోలు చేసే క్రమంలో దొంగ నోటు వచ్చిందని దుకాణం నిర్వాహకులు తెలిపారు.

ఫెర్టిలైజర్ షాపుకి చెందిన గుమస్తా పెట్రోల్ బంక్‌లో చూపెట్టడంతో నకిలీగా తేలిందన్నారు. ప్రస్తుతం రైతులు పంటలను మార్కెట్లో విక్రయిస్తున్న క్రమంలో ఆర్ధిక లావాదేవీలు అధిక మొత్తంలో జరుగుతున్నాయి. నిరక్ష్యరాసులైన రైతులు దొంగ నోట్లను గుర్తించలేని పరిస్థితి నెలకొంది. నెక్కొండ మండల పట్టణంలో గత కొద్ది సంవత్సరాలుగా రూ.10, రూ.20, రూ.100 దొంగ నోట్లు చలామణి కాగా, కొత్తగా రూ.200 రూపాయల నోటు దర్శనమివ్వడంతో స్థానిక ప్రజలు అందరూ అవాక్కయ్యారు. 200 రూపాయల నోటు విలువ ఎక్కువ కావడంతో ప్రజలు గుర్తించలేని సందర్భంలో తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు దొంగనోట్ల చలామణీ పై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాపారులు, రైతులు కోరుతున్నారు.

Next Story

Most Viewed