ఫేక్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ లింక్స్.. తస్మాత్ జాగ్రత్త

by  |
vaccine registration
X

దిశ, ఫీచర్స్: కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి దేశమంతటా వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతోంది. మొన్నటివరకు 45 సంవత్సరాలు పైబడిన వారికి ‘టీకా’లు అందించగా, ప్రస్తుతం 18+ ఏజ్ గ్రూప్ వారు వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వాలు ఆదేశాలిచ్చాయి. ఈ నేపథ్యంలోనే టీకా వేయించుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోమంటూ ఓ నకిలీ SMS వైరల్ అవుతోంది. ఇది ఫేక్ సైట్ కాగా, అప్రమత్తం కావాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

కొవిన్​పోర్టల్‌లో రిజిస్ట్రేషన్​చేసుకుని, స్లాట్​బుక్​చేసుకున్నవారికి మాత్రమే కరోనా వ్యాక్సిన్​వేస్తామని పబ్లిక్​హెల్త్​డైరెక్టర్​డాక్టర్​శ్రీనివాసరావు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు స్లాట్​బుక్​చేసుకోకుండా డైరెక్ట్‌గా సెంటర్ల వద్దకు వస్తే వ్యాక్సిన్​ఇవ్వరన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు సెకండ్​డోస్​వేసుకునేవారు కూడా ముందే స్లాట్​బుక్​ చేసుకోవాలి. కాగా, కొవిన్ పోర్టల్ https://selfregistration.cowin.gov.in/లో వ్యాక్సినేషన్​సెంటర్లతో పాటు అందుబాటులో గల స్లాట్ల వివరాలు పొందుపరచబడ్డాయి. ఇక ఫోన్‌లోనే రిజిస్ట్రేషన్‌తో పాటు స్లాట్​బుకింగ్ చేసుకునే సదుపాయం ఉండగా, ఆ అవకాశం లేనివాళ్లు మీసేవ సెంటర్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. అయితే ట్రెండింగ్‌లో ఉన్న ప్రతీ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే సైబర్ నేరగాళ్లు.. ‘వ్యాక్సినేషన్’ చేసుకోవాలంటూ ఓ లింక్ సెండ్ చేస్తున్నారు. దీన్ని క్లిక్ చేయగానే.. మాలీషియస్ యాప్‌ వినియోగదారుడి ఫోన్‌లో ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అవుతుంది. అచ్చం కొవిన్ ప్లాట్‌ఫామ్‌లాగే కనిపిస్తుండగా.. సైబర్ సెక్యూరిటీ సంస్థ ESET, మాల్వేర్ పరిశోధకుడు లుకాస్ స్టెఫాంకో దీన్ని గుర్తించాడు.

సో తస్మాత్ జాగ్రత్త.. ప్రభుత్వ పోర్టల్‌లో తప్ప, షేరింగ్ ద్వారా వచ్చిన లింక్స్‌ ఓపెన్ చేయకపోవడమే ఉత్తమం. వ్యాక్సిన్ కోసం ఆరోగ్య సేతులో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉన్నందున థర్డ్ పార్టీ యాప్, వెబ్ పేజీల జోలికి వెళ్లకూడదని.. వాటి నుంచి వచ్చే మెసేజ్, SMS లేదా ఇమెయిల్‌ లింక్స్‌పై క్లిక్ చేయడమే కాదు, షేర్ కూడా చేయవద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.


Next Story

Most Viewed