వివాదాస్పదంగా మారిన హెడ్‌మాస్టర్‌ నిర్ణయం.. ఎందుకంటే..?

by  |
వివాదాస్పదంగా మారిన హెడ్‌మాస్టర్‌ నిర్ణయం.. ఎందుకంటే..?
X

దిశ, మక్తల్: వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని అమరచింత‌ ఉన్నత పాఠశాలలో ఫేక్ కరోనా కలకలం రేపింది. ఐదుగురు విద్యార్థులకు జ్వరం రావడంతో.. కరోనా పరీక్షలు నిర్వహించకుండానే పాఠశాల హెడ్‌మాస్టర్‌ రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. ఆ తర్వాత డాక్టర్లు కరోనా రాలేదని.. సీజనల్ జ్వరం అంటూ పరీక్షల్లో ధృవీకరించారు. అయితే, ఫేక్‌ కరోనా సాకుతో సెలవు ప్రకటించిన సదరు హెడ్‌మాస్టర్‌ను సంప్రదించే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.

ప్రస్తుతం ఈ వ్యవహారంపై స్థానికులు మండిపడుతున్నారు. ఎట్టకేలకు స్కూల్స్ ఓపెన్ అయిన తరుణంలో కరోనా సాకుతో మళ్లీ సెలవులు ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. ఫేక్ కరోనా విషయాన్ని వనపర్తి జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లగా రేపటి నుంచే ప్రత్యక్ష తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. అమరచింత హైస్కూల్‌లో శానిటైజ్ కూడా చేస్తామని మున్సిపల్ చైర్మన్, కమిషనర్ చెప్పుకొచ్చారు. అయినప్పటికీ గాలివార్తతో పాఠశాలను మూసివేయడం వెనక ఆంతర్యం ఏమిటో చెప్పాలని తల్లిదండ్రులు డిమాండ్ చేయడం గమనార్హం.


Next Story

Most Viewed