- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువతితో FACEBOOKలో చాటింగ్.. నమ్మించి నగదుతో పరార్..
<p>దిశ, శేరిలింగంపల్లి : నకిలీ బాబాలు, దొంగ స్వామిజీల మాటలు నమ్మి గ్రామీణులు, నిరక్షరాస్యులే కాదు ఉన్నత చదువులు చదువుకున్న వారు సైతం నిలువునా మోసపోతున్నారు. నగరంలో ఓ ఎంబీబీఎస్ (MBBS) చదువుతున్న యువతి నకిలీ బాబా మాటలు నమ్మి వేల రూపాయల చేతి చమురు వదిలించుకుంది. పూజలు చేసి ఎంబీబీఎస్ పాస్ చేయిస్తానని చెప్పిన ఓ నకిలీ బాబా మాటలు నమ్మిన యువతి వేలాది రూపాయలను అతని చేతుల్లో పెట్టింది. అందినకాడికి దండుకున్న సదరు బాబా […]</p>

దిశ, శేరిలింగంపల్లి : నకిలీ బాబాలు, దొంగ స్వామిజీల మాటలు నమ్మి గ్రామీణులు, నిరక్షరాస్యులే కాదు ఉన్నత చదువులు చదువుకున్న వారు సైతం నిలువునా మోసపోతున్నారు. నగరంలో ఓ ఎంబీబీఎస్ (MBBS) చదువుతున్న యువతి నకిలీ బాబా మాటలు నమ్మి వేల రూపాయల చేతి చమురు వదిలించుకుంది. పూజలు చేసి ఎంబీబీఎస్ పాస్ చేయిస్తానని చెప్పిన ఓ నకిలీ బాబా మాటలు నమ్మిన యువతి వేలాది రూపాయలను అతని చేతుల్లో పెట్టింది. అందినకాడికి దండుకున్న సదరు బాబా ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వజిత్ జా అనే బాబా కాలభైరవ పూజతో ఎంబీబీఎస్ పాస్ చేయిస్తానని ఓ యువతిని నమ్మబలికాడు. ఫేస్ బుక్ ద్వారా యువతితో విశ్వజిత్ జా బాబా పరిచయం పెంచుకున్నాడు. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ పాస్ చేయిస్తానని చెప్పడంతో యువతి బాబాను నమ్మింది. కాలభైరవ పూజచేసి తన శక్తుల ద్వారా ఎంబీబీఎస్ పాస్ చేయిస్తానని చెప్పడంతో యువతి బాబాను బాగా విశ్వసించింది.
పూజల పేరుతో విడతలవారీగా ఆమె వద్ద నుండి రూ. 80 వేల నగదును దొంగబాబా తన అకౌంట్ లో జమ చేయించుకున్నాడు. అనంతరం బాబాను సంప్రదించేందుకు అనేక మార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో మోసపోయానని తెలుసుకున్న యువతి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






