'పునరుద్ధరణకు మౌలిక వసతుల మూలధన వ్యయం కీలకం'

by  |
పునరుద్ధరణకు మౌలిక వసతుల మూలధన వ్యయం కీలకం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ఆర్థిక కార్యకలాపాలు (Economic activities) పుంజుకుంటున్నప్పటికీ, మౌలిక వసతుల కోసం మరిన్ని ఆర్థిక ఉద్దీపనలు (Economic stimuli) అవసరమని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఈవై వెల్లడించింది. ప్రభుత్వం ఇప్పటికే పలు ఆర్థిక ఉద్దీపనలు ప్రారంభించిందని, సరైన విధానాలతో, నియంత్రణ, పెట్టుబడులతో ఆర్థిక పురోగతిని సాధించవచ్చని ఈవై తెలిపింది.

ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైన మరింత పురోగతి సాధించేందుకు మూలధన వ్యయం కీలకంగా మారనున్నట్టు ఈవై నేషనల్ ట్యాక్స్ లీడర్ సుధీర్ కపాడియా తెలిపారు. ఉపాధి కల్పన (Employment Fiction), తయారీ, జీడీపీ వృద్ధి (GDP growth) లాంటి అంశాలపై ఫలితాలు సానుకూలంగా ఉండేందుకు మూలధన వ్యయం (Capital expenditure) ఎంతో ముఖ్యమని వివరించారు.

మౌలిక సదుపాయాల కేంద్రీకృత ఆర్థిక ఉద్దీపన భారత పునరుద్ధరణకు కీలకమని ఈవై నివేదిక స్పష్టం చేసింది. ఆర్‌బీఐ (RBI)రుణాల కార్యక్రమం ఆధారంగా జీడీపీలో ఆర్థిక లోటు 5.6 శాతంగా అంచనా వేస్తున్నట్టు ఈవై తెలిపింది. అదనంగా మరో 1.4 శాతం(రూ. 3 లక్షల కోట్లు) తక్కువ రేటుకు విదేశాల నుంచి రుణాలను తీసుకోవడం ద్వారా మౌలిక వసతుల (Infrastructure) మూలధన వ్యయం (Capital expenditure)పై ఖర్చు చేయాలంటూ ఈవై సూచించింది.

మొత్తం సెస్ వసూళ్లలో రోడ్డు, మౌలిక వసతుల సెస్, ఆరోగ్యం, విద్య సెస్సుల ఆదాయం సుమారు రూ. 2 లక్షల కోట్లను కేటాయించవచ్చని వెల్లడించింది. మొత్తం రూ. 5 లక్షల కోట్ల నిధులు భవిష్యత్తులో మౌలిక వసతుల పెట్టుబడులకు కీలకంగా ఉండనున్నట్టు ఈవై పేర్కొంది.

Next Story

Most Viewed