ఎక్స్‌పీరియన్స్ దొంగలు.. ‘మణప్పురం’‌‌ లాకర్‌ తెరవలేదు.!

215

దిశ, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాల్‎టెక్స్ ఏరియాలోని మణప్పురం గోల్డ్ లోన్ కార్యాలయంలో అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. శనివారం ఉదయం కార్యాలయానికి చేరుకున్న సిబ్బంది.. తలుపులు తెరిచిచూడగా వస్తువులు చిందర వందర‌గా పడి ఉన్నాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, బెల్లంపల్లి ఏసీపీ రహమాన్, సీఐ‌లు జగదీష్, రాజు, తదితర సిబ్బంది మణప్పురం గోల్డ్ కార్యాలయానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రంగంలోకి దింపి దర్యాప్తు చేపట్టారు.

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. మణప్పురంలో అనుభవం కలిగిన దొంగలే దోపిడీకి ట్రై చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అయినప్పటికీ, ఆభరణాలు, నగదు చోరీ చేయలేకపోయారని చెప్పారు. దొంగలు లాకర్లు ఓపెన్ చేయడానికి చేసిన ప్రయత్నాలు విఫలం‌ కావడంతో వెనుదిరిగి వెళ్ళినట్లు పరిశీలనలో తేలిందన్నారు. నిందితులను పట్టుకోవడానికి మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని.. త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీసీపీ స్పష్టం చేశారు.