కొత్త బిల్డింగ్ కట్టినా.. అద్దె ఆఫీసులోనే అధికారులు

by  |
కొత్త బిల్డింగ్ కట్టినా.. అద్దె ఆఫీసులోనే అధికారులు
X

దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో సుమారు 30 గుంటల విస్తీర్ణానికి పైగా స్థలంలో నిర్మించిన ఎక్సైజ్ శాఖ భవనం అన్ని హంగులతో పూర్తయింది. సుమారు రూ. 38 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని నేటికీ ఎక్సైజ్ శాఖకు అప్పగించలేదు. బిల్డింగ్ పూర్తి జరిగి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ జిల్లా కార్యాలయం అద్దె భవనంలోనే నడుస్తున్నది. బిల్డింగ్ నిర్మించిన సంబంధిత కాంట్రాక్టర్లకు సుమారు రూ.12 లక్షల పెండింగ్ బిల్లులు రాకపోవడంతో నూతన బిల్డింగ్ ఆ శాఖకు అప్పగించలేదు. అద్దె భవనంలో నడుస్తున్న ఎక్సైజ్ శాఖ కార్యాలయంకు సరిపడా స్థలం లేకపోవడంతో అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్‌ ఉన్న బిల్లులను చెల్లించి ఎక్సైజ్ శాఖకు నూతన భవనాన్ని కేటాయించాలని జిల్లా అధికారులు కోరుతున్నారు.

Next Story

Most Viewed