చేతకాక.. పెన్షన్లు తొలగిస్తున్నారు

by  |
devineni
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి, దేవినేని ఉమా మహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి సంపదసృష్టించడం చేతకాదని విరుచుకుపడ్డారు. మైలవరంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన సంపద సృష్టించడం చేతకాక లక్షల కోట్లు అప్పులు తెచ్చారని అన్నారు. అవి ఎలా తీర్చాలో తెలియక సంపద సృష్టించడం చేతకాక చేతులెత్తేశారని మండిపడ్డారు. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఢిల్లీలో, సీఎం జగన్ తాడేపల్లిలోని ఇంట్లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. చేతకానితనంతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని దేవినేని ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చి ఉద్యోగులను, పేదలను మోసం చేశారని ధ్వజమెత్తారు. నవరత్నాలు అంటూ వంచించారని.. ప్రస్తుతం పెన్షన్లు కూడా ఇవ్వలేక.. అన్యాయంగా తొలగిస్తున్నారని దేవినేని విమర్శించారు.



Next Story