Insomnia: కొవిడ్ ప్రాబ్లమ్స్.. నిద్రలేమితో ‘కరోనాసోమ్నియా’

by  |
Insomnia: కొవిడ్ ప్రాబ్లమ్స్.. నిద్రలేమితో ‘కరోనాసోమ్నియా’
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుత జనరేషన్‌లో చాలామంది యువతీయువకులు నిద్రలేమిని ఎదుర్కొంటున్నారు. ‘ఇన్‌సోమ్నియా’ (Insomnia) అని పిలువబడే ఈ రుగ్మత స్వల్పకాలికం లేదంటే దీర్ఘకాలికంగా ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పాండమిక్ పరిస్థితులు కూడా నిద్రలేమి కేసులు పెరిగేందుకు దారితీస్తుండటంతో ‘కరోనాసోమ్నియా’ (Insomnia) అనే కొత్త పదం తెరమీదకు వచ్చింది. కాగా, ఈ సమస్య నుంచి బయటపడేందుకు ముంబైకి చెందిన స్లీప్ అప్నియా డాక్టర్ అనామికా రాథోడ్ కొన్ని సూచనలు అందించింది.

కరోనాసోమ్నియా రావడానికి పలు కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఒత్తిడి. వ్యాధి సోకిందనే భయం, ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందడం, ఎక్కువగా వార్తలు చూడటం, నిస్సహాయంగా అనిపించడం, కొవిడ్ సోకిన కుటుంబ సభ్యులను కలవలేకపోవడం వంటి అంశాలు ఒత్తిడికి గురిచేస్తున్నాయి. అంతేకాకుండా శారీరక శ్రమ లేకపోవడం, ఆన్‌లైన్ వర్క్స్, విరామం లేకుండా పనిచేయడం, విహారయాత్రలు వెళ్లలేకపోవడం, స్క్రీన్ టైమ్ పెరగడం వంటివి కూడా నిద్రలేమికి కారణాలుగా చెప్పొచ్చు. కొన్నిసార్లు పగటిపూట అతి నిద్ర కూడా రాత్రి నిద్రను దూరం చేస్తుంది.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగాలు కోల్పోవడం, తక్కువ సంపాదన, కెరీర్‌పై అభద్రత, పెరుగుతున్న ఖర్చులు ‘ఇన్‌సోమ్నియా’కు దారితీస్తాయి. ఇవే కాకుండా షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీత్, బాడీ పెయిన్స్, ఆందోళన, నిరాశ, సైకోసిస్, పీడకలలు, డూమ్ ఫీలింగ్ వంటి వివిధ లక్షణాల వల్ల ‘నిద్రలేమి’కి గురవుతాం. పాండమిక్ సమయంలోని ఒంటరితనం, దీర్ఘకాలిక దిగ్బంధం, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో వ్యక్తిగతంగా మాట్లాడలేకపోవడం కూడా కారణంగా నిలుస్తున్నాయి.

ఎలా బయటపడాలి?

వార్తలు, చాలా ఆన్‌లైన్ అప్‌డేట్స్‌కు దూరంగా ఉండటమే ఉత్తమం. కోలుకున్న రోగులపై ఎక్కువ దృష్టి పెట్టండి, వ్యాయామాలు, ఆరోగ్యకరమైన ఆహారంతో రోజువారీ దినచర్యను అనుసరించండి. పగటిపూట అదనపు నిద్రను నివారిస్తూ డైలీ స్లీపింగ్ షెడ్యూల్ ఫాలో అవండి. స్క్రీన్ సమయాన్ని తగ్గించండంతో పాటు సంగీతం వినడం, పుస్తక పఠనం వంటి కొన్ని అభిరుచులను పెంచుకోండి. ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోండి. నిద్రలేమి ప్రారంభమైన తర్వాత, నిద్రించడానికి అదనపు ఒత్తిడి ఉంటుంది. దీనిని ఎదుర్కోవటానికి మందులు తీసుకుంటే, అవి రెగ్యులర్ స్లీప్ సైకిల్‌ను మార్చడమే కాక ఉపశమనమేమీ లభించదు. శారీరకంగా శ్రమించడం, మద్యపానం/ధూమపానాన్ని తగ్గించడం, నెగటివ్ న్యూస్‌కు దూరంగా ఉండటం, పాజిటివ్‌నెస్‌ను పెంచుకోవడం ద్వారా ఈ రుగ్మత నుంచి బయటపడొచ్చు.
– డాక్టర్ అనామికా రాథోడ్, ఈఎన్‌టీ/ఎండోస్కోపిక్ సైనస్, స్లీప్ అప్నియా సర్జన్

Most cases of insomnia are related to poor sleeping habits, depression, anxiety, lack of exercise, chronic illness or certain medication.
Symptoms may include difficulty falling or staying asleep and not feeling well-rested.
Treatment for insomnia consists of improving sleep habits, behavior therapy and identifying and treating underlying causes. Sleeping pills may also be used, but should be monitored for side effects.


Next Story

Most Viewed