స్నాప్‌చాట్‌లో న్యూ ఫీచర్స్

by  |
స్నాప్‌చాట్‌లో న్యూ ఫీచర్స్
X

దిశ, వెబ్‌డెస్క్ :
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘స్నాప్ చాట్’ తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. తాజాగా జరిగిన ‘స్నాప్‌ పాట్నర్ సమ్మిట్-2020’లో వీటిని లాంచ్ చేసింది. న్యూ యాక్షన్ బార్, బ్రేకింగ్ న్యూస్ కోసం న్యూ సెక్షన్, స్నాప్ గేమ్స్, మోర్ ఒరిజినల్ కంటెంట్.. ఇకపై స్నాప్‌చాట్ యూజర్లకు అందుబాటులోకి వచ్చినట్టే.

పాపులర్ హ్యాంగింగ్ అవుట్ ప్లేసె‌స్ ఎక్కడ ఉన్నాయో ఈజీగా చూపించడానికి ‘స్నాప్ మ్యాప్’ ఉపయోగపడుతుంది. అంతేకాదు ‘స్టోరీ రిప్లైస్’‌ను స్నాప్ స్టార్స్‌కు సెండ్ చేసే అవకాశాన్ని తీసుకొచ్చింది.

కంటెంట్ :

డిస్నీ, ఈఎస్‌పీఎన్, ఎన్‌బీసీ యూనివర్సల్, వయాకామ్‌సీబీఎస్, ద ఎన్‌బీఏ, ఎన్‌ఎఫ్ఎల్ చానల్స్‌కు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ షోస్‌ను ఇకపై స్నాప్ చాట్ డిస్కవర్ ప్లాట్‌ఫామ్‌లో చూడొచ్చు. అంతేకాదు బ్రేకింగ్ న్యూస్ కోసం ‘హ్యాపెనింగ్ నౌ’ అనే ట్యాబ్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ ద్వారా వాషింగ్టన్ పోస్ట్, రూటర్స్, బ్లూమ్‌బెర్గ్, బజ్‌ఫీడ్ వంటి ఆర్గనైజేషన్స్ నుంచి బ్రేకింగ్ న్యూస్ ఫీడ్ వస్తుందని స్నాప్ చాట్ నిర్వాహకులు తెలియజేశారు.

స్నాప్ మినీస్ :

చాట్ సెక్షన్‌లో ‘స్నాప్ మినీస్’ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై ట్యాప్ చేయగానే అది ఫుల్ స్క్రీన్‌లో కనిపిస్తుంది. ఫ్రెండ్స్‌తో కలిసి గ్రూప్ షెడ్యూల్స్, ప్లాన్స్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మూవీ టికెట్ ఆర్డర్ చేయడం, కంపేరింగ్ క్లాస్ షెడ్యూల్స్ వంటివి ఇక్కడ కనిపిస్తాయి. మొత్తంగా ఇందులో హెడ్ స్పేస్, మూవీ టికెట్స్ బై ఆటమ్, లెట్స్ డూ ఇట్, ప్రిడిక్షన్ మాస్టర్, సాటర్న్, టెంబో వంటి ఆరు సెక్షన్లు ఉన్నాయి.

స్కాన్ ప్లాంట్స్ అండ్ డాగ్స్ : 90 శాతం మొక్కలు, చెట్లను ప్లాంట్ స్నాప్ కెమెరాతో స్కాన్ చేసి, అవి ఏ రకమో గుర్తించవచ్చు. అంతేకాదు స్నాప్‌చాట్‌లోని డాగ్ స్కానర్ కుక్కలకు సంబంధించిన 400 బ్రీడ్స్ వరకు గుర్తిస్తుంది.

గేమ్స్ :

కొత్తగా మొత్తం 10 రకాల గేమ్స్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. అందులో బిట్‌మోజీ పెయింట్, క్విజ్ పార్టీ, స్లింగ్ రేసర్స్, స్నో టైమ్, జింగాస్ బంప్డ్ వంటివి ఉన్నాయి.


Next Story

Most Viewed