సెల్ రాకతో అరచేతిలో ప్రపంచం

by  |
సెల్ రాకతో అరచేతిలో ప్రపంచం
X

సెల్ ఫోన్ ఒకప్పుడు అవసరం.. ప్రస్తుతం నిత్యావసరంగా మారింది. సెల్​ఫోన్​ లేనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కనీసం అరగంటకోసారైన ఫోన్​ టచ్​ చేయకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇక యువత సెల్​ బానిసలుగా మారారు. గేమ్ లలో మునిగి తేలుతూ టైమ్​మర్చిపోతుంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంట్లో మనిషిలా, ఒంట్లో అవయవంలా తయారైంది. సెల్ వినియోగంతో ఎంత ఉపయోగం ఉందో అంతే అనర్థాలకు కారణమవుతుందని నిపుణలు హెచ్చరిస్తున్నారు.

దిశ, శేరిలింగంపల్లి: ఫోన్ అనేది ఒకప్పుడు అవసరం మాత్రమే, కానీ ఇప్పుడు అత్యవసరం.. రోజూవారి జీవితంలో భాగమైంది. చేతిలో సెల్‌ ఉంటే చాలు అరచేతిలో ప్రపంచం ఉన్నట్లే. ప్రపంచంలో తక్కువ కాలంలో అత్యంత ఎక్కువగా జనాలను ప్రభావితం చేసిందంటే ఖచ్చితంగా అది సెల్‌ఫోనే. ఒకప్పుడు విలాస వస్తువుగా ఉన్న సెల్‌ ఫోన్‌ అతి తక్కువ కాలంలోనే అందరికి అత్యవసరంగా మారింది. ఇప్పటికీ దేశంలో టాయ్‌ లెట్స్‌లేని ఇండ్లు ఉండచ్చు కానీ, సెల్‌ ఫోన్‌ లేని ఇళ్లు లేదంటే నమ్మక తప్పని పరిస్థితి. స్కూల్‌ పిల్లాడి నుంచి పండు ముసలి వరకు సెల్‌ ఫోన్స్‌ యూజ్‌ చేస్తున్నారంటే ఇది ఎంత ఇంపార్టెంట్‌ గా మారిపోయిందో ఊహించుకోవచ్చు.

సెల్ ఫోనే సర్వస్వం..

సెల్ వాడకంలో కుర్రకారు జోరుకు మరీ పట్టపగ్గాల్లేవు. టెన్త్ పాసైతే చాలు తల్లిదండ్రులు తమ పిల్లలకు సెల్‌ కొనిస్తున్నారు. కాలేజీకి వెళ్లే ప్రతి అమ్మాయి, అబ్బాయి చేతిలో సెల్ ఉండాల్సిందే. ప్రతీ కుటుంబం సెల్ వినియోగిస్తుందని ఈ మధ్య నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. రోజు రోజుకూ పెరుగుతున్న వీటి వాడకం మరికొన్ని రోజుల్లో ప్రపంచ జనాభాను దాటిపోనుందని సర్వేలో వెల్లడైంది. అప్పటికి ప్రపంచ జనాభా 700 కోట్లుంటే సెల్‌ ఫోన్ల సంఖ్య 730 కోట్లకు చేరుతుందని ఇంటర్నేషనల్ టెలీ కమ్యునికేషన్ యూనియన్ జరిపిన రీసెర్చ్ ద్వారా తెలిసింది.

పరిధులు లేని సెల్ ..

ఒకప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు మాత్రమే పరిమితమైన ఫోన్లు ఆధునిక సాంకేతికత పుణ్యమా సర్వస్వంగా మారాయి. ఆటలు, పాటలు, మెసేజ్‌లు, మూవీస్‌, న్యూస్‌, విజ్ఞానం, వినోదం అన్నీ ఒక్క సెల్‌ఫోన్‌ లోనే లభిస్తుండడంతో పొద్దస్తమానం వాటితోనే కాలక్షేపం చేస్తున్నారు. సెల్‌ చేతిలో ఉందంటే అరచేతిలో ప్రపంచం ఉన్నట్లే.. సెల్‌ మాయలో పడి బంధాలు, అనుబంధాలకు తిలోదకాలు ఇచ్చేస్తున్నారు.

ప్రపంచంతో పనేముంది..

చేతిలో న్యూ ఆప్షన్స్‌ సెల్‌ ఉంటే చాలు ప్రపంచంలో ఏదో ఓ మూలనైనా బతికేయొచ్చన్నది నేటి యూత్‌ ఫీలింగ్‌. ఎందుకంటే అందులోనే ప్రపంచం అంతా ఉంటుందన్నది వారి ఒపీనియన్. ఒక్క కాల్‌తో కావాల్సిన వారితో మాట్లాడేయొచ్చు. మొబైల్‌ ఉన్న ఆప్షన్లతో గూగుల్‌లో గుడికి వెళ్లి, ముఖ పుస్తకంలో ముఖాలు చూసుకుని, హైక్‌లో హాయ్‌చెప్పి, వాట్సాప్‌లో వాట్‌ ఆర్‌ యూ డూయింగ్‌ అని పలకరించి, ట్విట్టర్‌లో ట్వీట్‌ చేసి అందరికి టచ్‌లో ఉండచ్చు. ఆన్‌లైన్‌ షాపింగ్‌నుంచి బ్యాంకు బ్యాలెన్స్‌ వరకు మొబైల్‌ లోనే చెక్ చేసుకోవచ్చు. మూవీ చూడాలన్నా, రివ్యూ రాయాలన్నా.. దేశ విదేశాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న సెల్‌ ఉంటే చాలు.

ఎన్నేనో యాప్స్..

యూత్‌ టేస్ట్‌కు అనుగుణంగా మొబైల్‌ కంపెనీలు పోటీ పడి మరీ కొత్త అప్షన్స్ ఉన్నా మొబైల్స్ ను, యాప్స్‌ ను అందుబాటులోకి తెస్తున్నాయి. ఒకప్పుడు ఫోన్‌ అంటే రూ.10 వేలు పెడితే తప్పా దొరికేది కాదు. కానీ ఇప్పుడు కేవలం రూ.5వేలు చాలు బోలెడన్ని ఆప్షన్స్‌ ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేస్తుంది. ఇంకేముంది స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో ఉంటే చాలు లైఫ్‌ బిందాస్‌ గా గడిపేయొచ్చు. కానీ అతి సర్వత్రా వర్జయేత్ అన్నవిషయాన్ని మర్చిపోవద్దు. సో జాగ్రత్త.. ఇప్పటికైనా సెల్ ఫోన్ మాయలో నుంచి బయటకు వచ్చేయండి. అవసరాలకు వాడుకోవడం మంచిదే కానీ, అనవసరంగా దాని మాయలో పడితే జీవితంలో చాలా కోల్పోతామన్నది గుర్తుంచుకోవాలి.



Next Story

Most Viewed