ఈపీఎఫ్ క్లెయిమ్‌లో కొత్త విధానం!

by  |
ఈపీఎఫ్ క్లెయిమ్‌లో కొత్త విధానం!
X

ముంబయి: ఈపీఎఫ్ క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో ఇబ్బందులను నివారించేందుకు ఈపీఎఫ్‌వో కొత్త విధానాన్ని అమలు చేయనున్నది. ఇందుకోసం మల్టీ లొకేషన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ సౌకర్యం ప్రవేశపెట్టింది. ప్రాంతీయ కార్యాలయాల్లోనూ ఈపీఎఫ్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ పూర్తిచేసుకునే విధానం ప్రారంభించింది. కరోనా వైరస్ వ్యాప్తితో కంటైన్‌మెంట్ జోన్లలో ఈపీఎఫ్ ఆఫీసులు మూసివేయడం, తక్కువ మంది ఉద్యోగులతో పనిచేయడం వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ విధానాన్ని అమలుపరుస్తున్నట్టు ఈపీఎఫ్‌వో కార్యాలయం తెలిపింది. ఈ ఇబ్బందుల వల్ల క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో ఆలస్యమవుతున్నదని, దాన్ని నివారించడానికే మార్పులు చేస్తున్నట్టు, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ కార్యాలయాల్లోనూ ఇది వర్తిస్తుందని పేర్కొంది. పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, క్లెయిమ్‌లు, ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్‌లు, పాక్షిక విత్‌డ్రా తదితర అన్ని రకాల ఆన్‌లైన్ క్లెయిమ్‌లను మల్టీ లొకేషన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ సౌకర్యం ద్వారా చేసుకోవచ్చని ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది. 2020 ఏప్రిల్ 1 నుంచి రోజుకు రూ .270కోట్లతో 80 వేల క్లెయిమ్‌లను ఈపీఎఫ్‌వో సెటిల్ చేసింది. కొవిడ్-19 అడ్వాన్సులను కేవలం మూడు రోజుల్లో సెటిల్ చేస్తున్నది.



Next Story

Most Viewed