మాకు ఆ టెన్షన్ ఇంకా పోతలేదు: విద్యార్థులు!

by  |
మాకు ఆ టెన్షన్ ఇంకా పోతలేదు: విద్యార్థులు!
X

దిశ, ఏపీ బ్యూరో: పదోతరగతి విద్యార్థులకు పరీక్షల ఇక్కట్లు తప్పడం లేదు. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో పదోతరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. ఈ మేరకు జీవోను విడుదల చేసింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడే ప్రభుత్వం మెలిక పెట్టింది. 2019–20 బ్యాచ్‌ విద్యార్థుల మార్కుల మెమోల్లో గ్రేడ్‌ పాయింట్లు లేకుండా వాటి స్థానంలో సబ్జెక్టుల వారీగా ‘పాస్‌’ అని పేర్కొనాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.

ఈ ఒక్క ఏడాదికి మాత్రమే ఇది వర్తించేలా పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ జీఓ 34ను విడుదల చేశారు. దీని ప్రకారం టెన్త్‌ పరీక్షలకు దరఖాస్తు చేసి హాల్‌ టికెట్లు జారీ అయిన విద్యార్థులందరూ గ్రేడ్‌ పాయింట్లు లేకుండా ఉత్తీర్ణులైనట్లుగా ప్రకటించారు. అయితే, ఈ బ్యాచ్‌ విద్యార్థులకు గ్రేడ్‌ పాయింట్లు కేటాయించనందున వీరిని పై కోర్సుల్లో చేర్చుకునేటప్పుడు మెరిట్‌ విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని జీఓలో పేర్కొన్నారు. ఇదే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అసంతృప్తి కలిగిస్తోంది. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు.



Next Story

Most Viewed