భారీగా పెరిగిన ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులు

by  |
భారీగా పెరిగిన ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులు
X

దిశ, వెబ్‌డెస్క్: యూఎస్, చైనా, జర్మనీ, ఇటలీ సహా మొత్తం 25 కీలక మార్కెట్లలో 23 దేశాలకు భారత ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులు ఈ ఏడాది ఏప్రిల్‌లో సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. ప్రధానంగా భారత్ నుంచి మొత్తం సరుకుల ఎగుమతులు బేస్ ఎఫెక్ట్ కారణంగా వార్షిక ప్రాతిపదికన పెరిగాయి. దేశీయ ఇంజనీరింగ్ వస్తువుల విభాగంలో మొత్తం 25లో మలేషియా, సింగపూర్ మాత్రమే ప్రతికూల వృద్ధిని కనబరచినట్టు తెలుస్తోంది.

ఈ రకమైన ఎగుమతుల్లో చైనా అతిపెద్ద మార్కెట్‌గా నిలవగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో యూఎస్‌కు ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 400 శాతం పైగా పెరిగాయి. భారత్ రెండో అతిపెద్ద ఎగుమతిదారైన చైనాకు ఈ నెలలో 143.3 శాతం నెలవారీ వృద్ధి నమోదైంది. కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ గత కొన్ని నెలలుగా వృద్ధి వేగం కొనసాగుతోంది. ఇది ప్రపంచ మార్కెట్ల పోకడకు అద్దం పడుతోందని ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఈఈపీసీ) ఇండియా ఛైర్మన్ మహేష్ దేశాయ్ అన్నారు.

సానుకూల వృద్ధిని నమోదు చేసిన 32 ఇంజనీరింగ్ వస్తువుల విభాగాల్లో ఇనుము, ఉక్కు ఎగుమతులు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 210 శాతంతో భారీగా పెరిగాయి. అల్యూమినియం, జింక్, నికెల్, సీసం, ఇంకా ఇతర ఉత్పత్తులు 110.5 శాతం వృద్ధి నమోదు చేశాయి. ‘లాక్‌డౌన్ ఆంక్షల వల్ల ఆర్థిక కార్యకలాపాలు ప్రభావితం కాకుండా రాష్ట్రాల ప్రభుత్వాలు చూసుకుటున్నాయి. అయితే, వాణిజ్య, వ్యాపారాలు పూర్తిగా ఆగిపోలేదు. దీంతో ఎగుమతుదారులకు ప్రభుత్వం నుంచి తగిన మద్దతు లభిస్తోందని’ మహేష్ దేశాయ్ వెల్లడించారు.

Next Story

Most Viewed