Electric 3 wheeler Vehicles : 2025 నాటికి 30 శాతం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ వాహనాల అమ్మకాలు

by  |
Electric 3 wheeler Vehicles : 2025 నాటికి 30 శాతం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ వాహనాల అమ్మకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తక్కువ నిర్వహణ వ్యయం, ఆకర్షణీయమైన సబ్సిడీ మద్దతు కారణంగా 2025 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ వాహనాలు 8-10 శాతం, త్రీ-వీలర్ వాహనాలు 30 శాతం మేర అమ్మకాలు నమోదవుతాయని బుధవారం ఇక్రా నివేదిక తెలిపింది. ఎలక్ట్రిక్ కార్లు, ట్రక్కులు ఓ మోస్తరుగా ఉండొచ్చని అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా 2020లో ఎలక్ట్రిక్ కార్లు 4.4 శాతం అమ్మకాలు నమోదవగా, ఈ ఏడాదిలో ఇది 5 శాతం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఎలక్ట్రిక్ టూ-వీలర్, త్రీ-వీలర్ వాహనాలు వాణిజ్య కార్యకలాపాల కోసం ఎక్కువ అనుకూలంగా ఉన్నాయని ఇక్రా పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ టూ-వీలర్, త్రీ-వీలర్ వాహనాలు భారత్‌లో మెరుగైన వృద్ధిని కొనసాగించవచ్చు, అయితే ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కొంత వెనుకబడుతుందని ఇక్రా వివరించింది.

కరోనా వల్ల గతేడాది ప్రపంచ ఆటో పరిశ్రమలో డిమాండ్ క్షీణించినప్పటికీ, ఎలక్ట్రిక్ వాహనాల విభాగం మాత్రమే మునుపటి కంటే 40 శాతం వృద్ధిని సాధించింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం అనివార్యమైతే చైనా, యూఎస్, యూరప్ వంటి ప్రపంచ మార్కేట్ల మాదిరిగానే భారత్‌లోనూ ఈ వాహనాల విక్రయాలు పుంజుకోనున్నాయి. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వేగవంతమైన వృద్ధికి కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న సానుకూల విధాన చర్యలే అని ఇక్రా వైస్-ప్రెసిడెంట్ కార్పొరేట్ సెక్టార్ గ్రూప్ హెడ్ షంషర్ దేవన్ వెల్లడించారు. ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమ సాంకేతికతను అందిపుచ్చుకుంటొంది. సాంప్రదాయ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువ మంది మారతారని ఇక్రా వెల్లడించింది.


Next Story

Most Viewed