రేపు ఏపీ శాసన మండలి చైర్మన్ ఎన్నిక.. చైర్మన్‌గా వైసీపీ కీలక నేత..!

by  |
raju
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి చైర్మన్‌ ఎన్నికకు గురువారం నోటిఫికేషన్‌ విడుదలైంది. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు.. ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్‌ రాజు మండలి చైర్మన్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి పి. బాలకృష్ణమాచార్యులకు మోషేన్ రాజు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దువ్వాడా శ్రీనివాస్, బల్లి చక్రవర్తి, ప్రభాకర్‌రెడ్డిలు పాల్గొన్నారు.

నామినేషన్ దాఖలు అనంతరం ఎమ్మెల్సీ మోషేన్‌రాజు మాట్లాడుతూ.. కష్టపడి పనిచేసే కార్యకర్తకు అత్యున్నత పదవులు ఇచ్చే మనసు మహానేత వైఎస్‌ఆర్‌ కుటుంబానికే ఉందని చెప్పుకొచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, మహిళలకు 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుందని చెప్పుకొచ్చారు. ఇకపోతే నవంబర్ 19 శుక్రవారం శానస మండలి చైర్మన్‌ ఎన్నిక జరగనుంది. ఇప్పటి వరకు ఇతరులు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో మండలి చైర్మన్‌గా కొయ్యే మోషేన్‌ రాజు ఎన్నిక లాంఛనం కానుంది.

Next Story

Most Viewed