alert: నిరోద్యోగులకు శుభవార్త.. బ్యాంకు ఉద్యోగాలు..ఆఖరి తేదీ రేపే

by Disha Web Desk 3 |
alert: నిరోద్యోగులకు శుభవార్త.. బ్యాంకు ఉద్యోగాలు..ఆఖరి తేదీ రేపే
X

దిశ వెబ్ డెస్క్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో 484 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికి సుపరిచితమే. అయితే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు రేపే ఆఖరి తేదీ. దరఖాస్తుల ప్రక్రియ రేపటితో ముగుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో సఫాయి కర్మచారి/ సబ్ స్టాఫ్ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు పదో తరగతి ఉతీర్ణులైన వారు ఎవరైనా ఈ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు తేదీ రేపటితో ముగియనుంది.

కనుక పదో తరగతి పాసైన అభ్యర్థులు ఎవరైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే రేపటిలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక ఈ ఉద్యోగాలకు వయో పరిమితి విషయానికి వస్తే 18-26 ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. రిజర్వేషన్ బట్టి వయో సడలింపు ఉంటుంది. కాగా ఫిబ్రవరిలో ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం వెబ్ సైట్ ను సందర్శించిన తెలుసుకోవచ్చు.

Next Story

Most Viewed