- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ ఉద్యోగాలకు అప్లై చేశారా.. దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్!
ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చింది.

దిశ,వెబ్‌డెస్క్: ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో 996 కాంట్రాక్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం పోస్టుల్లో హైదరాబాద్‌లో 43, అమరావతిలో 29 ఉద్యోగాలు ఉన్నాయి. VP వెల్త్, AVP వెల్త్, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులు ఉన్నాయి.
పోస్టును బట్టి డిగ్రీ, ఎంబీఏ, CEP/CFA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులుగా ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ నేడే(డిసెంబర్ 23). షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ sbi.co.in లేదా sbi.bank.in ను సందర్శించవచ్చు. బ్యాంక్ నిబంధనల ప్రకారం.. ఎంపికైన వారికి ఆకర్షణీయమైన జీతభత్యాలు ఇతర ప్రయోజనాలు కూడా అందుతాయి.






