బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? మార్కెట్ ప్రభావమా... కుట్రా?

by Ravi |   (  Updated:2026-07-08 00:46:03  IST  )

బంగారం ధరలు ఎందుకు నిరంతరం పెరుగుతున్నాయి? కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డిమాండ్-సరఫరా, రూపాయి విలువ, దిగుమతి సుంకాలు వంటి అంశాలు ధరలపై ఎలా ప్రభావం చూపుతున్నాయి?

బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? మార్కెట్ ప్రభావమా... కుట్రా?
X

బంగారం ఉన్న ఇంట్లో చీకటి ఉండదు అనే సామెత ఉంది. కానీ ఈరోజు బంగారం కోసం చీకట్లు, దొంగతనాలు, హత్యలు జరుగుతున్నాయి. ధర ఆకాశానికి అంటుతోంది. దీని వెనుక కుట్ర ఉందా? లేక ఇది సహజమైన మార్కెట్ ఆటనా, బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, కుట్ర ఉందా?

మార్కెట్ మానిప్యులేషన్ చేస్తూ..

కుట్ర అని సూటిగా చెప్పలేం. కానీ నాలుగు పెద్ద సంస్థలు ధరను ఆడిస్తున్నాయి. ప్రపంచ కేంద్ర బ్యాంకులు. అమెరికా, యూరప్, చైనా బ్యాంకులు రిజర్వుగా బంగారాన్ని కొంటున్నాయి. పెట్టుబడి దారులు & ETFలు, షేర్ మార్కెట్ పడితే, యుద్ధాలు వస్తే అందరూ సురక్షిత పెట్టుబడిగా బంగారం కొంటారు. ఇది డిమాండ్‌ను పెంచుతుంది. డాలర్ vs రూపాయి... అంతర్జాతీయంగా బంగారం ధర డాలర్లలో ఉంటుంది. రూపాయి బలహీనపడితే, భారత్‌లో ధర ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. సరఫరా తక్కువ.. గనుల్లో కొత్త బంగారం తీయడం కష్టం. డిమాండ్ పెరుగుతోంది, సరఫరా అలాగే ఉంది.. పెద్ద పెద్ద ఫండ్లు కావాలని ధర పెంచి, తర్వాత అమ్మి లాభాలు తీసుకునే ఆట ఆడుతుంటాయి. దీన్ని మార్కెట్ మానిప్యులేషన్ అంటారు.

బంగారంపైనే మోజు ఎందుకు?

ప్రజలకు బంగారంపై అంత పిచ్చి ఎందుకు ఇది కేవలం అలంకారం కాదు. ఇది మన DNAలో ఉంది. నమ్మకం...బంగారం ఎప్పుడూ దిగదు.. ఏళ్లుగా వస్తున్న నమ్మకం. బ్యాంకు మునిగినా, కరెన్సీ విలువ పడినా బంగారం ఉంటుంది. స్త్రీ ధనం & సెక్యూరిటీ, మన సంస్కృతిలో ఆడపిల్లకు ఇచ్చే ఏకైక ఆస్తి. అత్తారింట్లో కష్టం వస్తే ఆదుకునే ఆయుధం. స్టేటస్ సింబల్ పెళ్లి, పండుగ అంటే బంగారం లేకుండా శుభం జరగదు. ఎంత బంగారం పెట్టారు అని అడిగే సమాజం మనది. నల్లధనం దాచే మార్గం. క్యాష్‌గా ఉంచలేని డబ్బును బంగారంగా మారుస్తారు. ఇది టాక్స్ కట్టకుండా దాచడా‌నికి ఒక మార్గం.

దుబాయ్‌లో ధర ఎందుకు తక్కువ?

బంగారం ధర దుబాయ్‌లో తక్కువగా, మన దగ్గర ఎక్కువగా ఎందుకుంటోంది? దుబాయ్‌లో 10 గ్రాముల 24K బంగారం మనకంటే 3000-5000 రూపాయలు తక్కువ ఉంటుంది. కారణం భారత్ దిగుమతి సుంకం 15%. దుబాయ్‌లో దిగుమతి సుంకం 0%. భారత్‌లో GST 3% + మేకింగ్ ఛార్జీలు... దుబాయ్‌లో GST లేదు, మేకింగ్ చాలా తక్కువ. భారత్‌లో డిమాండ్ బాగా ఎక్కువ. దుబాయ్‌లో డిమాండ్ తక్కువ. పైగా టూరిస్ట్ మార్కెట్. అందుకే దుబాయ్ గోల్డ్ అంటారు. కానీ అక్కడ కొని ఇక్కడ అమ్మితే కస్టమ్స్ పట్టుకుంటుంది.

ధరల తగ్గుదలకు పరిష్కారం ఏంటి?

కేంద్ర ప్రభుత్వం...బంగారం దిగుమతి తగ్గించడానికి సుంకం పెంచింది. Sovereign Gold Bond, Digital Gold లాంటి పథకాలు తెచ్చింది. తన రిజర్వ్‌లలో బంగారం శాతం పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంది. ప్రజలు సైతం బంగారాన్ని అర్థం చేసుకోవాలి. పెట్టు బడిగా అన్ని డబ్బులు బంగారంలో పెట్టొద్దు. 10-15% మాత్రమే ఉంచండి. మిగిలింది SIP, FDలలో పెట్టండి. ఆభరణంగా భారీ డిజైన్లు, ఎక్కువ మేకింగ్ ఛార్జీలు ఉన్నవి కొనొద్దు. 22K హాల్‌మార్క్ ఉన్నదే కొనండి. సమాజంగా బంగారం లేకుండా పెళ్లి లేదు అనే ఆచారాన్ని పక్కన పెట్టాలి. విలువ మనిషిలో ఉండాలి, మెడలోని గొలుసులో కాదు. బంగారం మనిషిని చంపడం లేదు. బంగారంపై ఉన్న మన మోజు ప్రాణాలు తీస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, మన సెంటిమెంట్ కలిసి ఈ ఆట ఆడుతున్నాయి.

-ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్,

94402 87170

Next Story